Manjummel Boys: మలయాళం మూవీ మంజుమెల్ బాయ్స్ సినిమాపై 20 కోట్లు పెట్టుబడి పెడితే 200 కోట్లు రాబట్టింది. ఇంకా వసూళ్లొస్తున్నాయి. ఈనెలాఖర్లో తెలుగులో కూడా రిలీజ్ అవుతోందంటే, ఇక్కడ ఓ పాతిక కోట్లు ఈజీగా రాబట్టేలా ఉంది. తక్కువ బడ్జెట్‌తో స్టార్లు లేకుండా కేవలం మతిపోగొట్టే కంటెంట్‌తో కోట్లు రాబట్టడం ఓ కళ.
GAME CHANGER: ఓటీటీ సంస్థ చేసిన పనికి అసలు కథే లీకై పోయిందా..?
అది మలయాళం ఫిల్మ్ మేకర్స్‌కి బాగా అలవాటైనట్టుంది. అందుకే అక్కడ కోటి పెడితే వందకోట్లు, రెండుకోట్లు పెడితే రెండొందల కోట్లు వస్తున్నాయి. ప్రేమలు సినిమా కూడా మలయాళంలో 3 కోట్లతో వచ్చి 115 కోట్లు రాబట్టింది. తెలుగు వర్షన్‌తో కలిపి ఈజీగా 150 కోట్లను రీచ్ అయ్యేలా ఉంది. దీనికి ముందు అప్పట్లో ప్రేమమ్ కూడా 4 కోట్లతో వచ్చి 75 కోట్లు రాబట్టింది. బెంగులూరు డేస్ అప్పట్లో 8 కోట్లతో వచ్చి 60 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లాస్ట్ ఇయర్ 2018 మూవీ ఏకంగా 26 కోట్ల బడ్జెట్‌ని 175 కోట్ల ప్రాఫిట్స్‌గా మార్చింది. ఇలాంటి వింతలు తెలుగులో కూడా జరిగాయి. కార్తికేయ 2 మూవీపై 15 కోట్లు పెడితే రూ.250 కోట్లొచ్చాయి. 40 కోట్ల హనుమాన్ రూ.350 కోట్ల వసూళ్లని రాబట్టింది. కన్నడలో కాంతార మూవీపై 16 కోట్ల పెట్టుబడి పెడితే 450 కోట్ల రాబడి వచ్చింది.
ఇలా తెలుగు, తమిళ్, కన్నడలో కూడా లోబడ్జెట్ ప్రయోగాలకు వందల కోట్లు వచ్చాయి. కానీ, మలయాళం మూవీలకు వరుసగా ఇలాంటివి జరగటం చూస్తే అంతా ఆశ్చర్య పోతున్నారు. పెద్ద స్టార్లు లేకుండా, ఒకటి రెండు కోట్ల పెట్టుబడిని వందలకోట్ల రాబడిగా మార్చే సినిమాలు మాలీవుడ్‌లో ఏడాదికి కనీసం ఒకటైనా వస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా రెండొచ్చాయి.