స్క్రీన్ మీద కనిపించే అమ్మాయి పేరు మలీషా ఖర్వా. వయసు 12 ఏళ్లు. ముంబై ధారావిలో ఉండే ఫ్యామిలీస్‌లో మలీషా ఫ్యామిలీ ఒకటి. ఏదో ఒక పని చేసుకుంటే తప్ప కడుపు నింపుకోలేని పరిస్థితి ఆ కుటుంబానిది. కానీ వాళ్ల చీకటి బతుకుల్లో మలీషా వెలుగు నింపింది. మురికి వాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను రెస్టారెంట్లో భోజనం చేయించి వాళ్ల అనుభవాలను షూట్ చేసే కాన్సెప్ట్‌తో “లైవ్ యువర్ ఫెయిరీ టేల్” అనే షార్ట్ ఫిలిం వచ్చింది. ఆ షార్ట్ ఫిలింలో కనిపించిన ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఒకరు.
ఈ షార్ట్ ఫలిం టెలికాస్ట్ ఐన తరువాత మలీషా ఫేస్ గ్లో అందరినీ ఆకర్షించింది. కల్మషం లేని మలీషా నవ్వుకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ తరువాత ఫారెస్ట్ ఎసెన్షిల్ అనే సంస్థ మలీషాను తమ కంపెనీకి మోడల్‌గా ఎంపిక చేసింది. మలీషాతో ఓ యాడ్ కూడా షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ యాడ్‌తో మలీషా జీవితం మారిపోయింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్ 2020లో మలీషాను కలిసేందుకు ముంబైకి వచ్చాడు. ఆమె ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసి ఆర్థికంగా సహాయంగా నిలవాలనుకున్నాడు. ఆమె కోసం “గో ఫండ్ మీ” అనే పేజిని కూడా క్రియేట్ చేశాడు. ఈ పేజ్ నుంచి చాలా మంది మలీషాకు ఫండింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ, మోడలింగ్ చేస్తూ సెలబ్రెటీగా మారిపోయింది మలీషా. ది పికాక్ అనే మ్యాగజైన్ మలీషా ఫొటోను ఏకంగా తన కవర్ పేజ్ మీద ప్రింట్ చేసింది.
సెలబ్రెటీగా మారిపోయినా ఇప్పటికీ ధారావి లోని తన ఇంట్లోనే ఉంటోంది మలీషా. ఇప్పుడు ఆమె అంతా ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ అని పిలుస్తున్నారు. మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 37 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా వెరిఫైడ్ బ్లూ టిక్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్. దీంతో బీబీసీ, హిందుస్తాన్ టైమ్స్ లాంటి నేషనల్ మీడియా సంస్థలు కూడా మలీషా స్టోరీని పబ్లిష్ చేశాయి. ప్రస్తుతం కొన్ని యాడ్స్‌తో పాటు.. రెండు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది మలీషా ఖర్వా.
గో ఫండ్ మీ పేజ్ నుంచి ఇంకా మలీషాకు ఫండింగ్ వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క యాడ్ మలీషా జీవితాన్నే మార్చేసింది. తన జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్తోంది మలీషా. ఎవరి జీవితం ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు కాబట్టి చేతికి అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడుకోవాలని చెప్తోంది.