Malli Pelli Movie: నరేశ్‌ జీవితమే మళ్లీ పెళ్లి సినిమా.. వైరల్ అవుతోన్న కొత్త వీడియోలు..

ఇప్పుడు ఇంటర్నెట్ అంతా మాట్లాడుకుంటోంది ఇద్దరి గురించే.. ఒకటి మస్క్ గురించి.. రెండు మళ్లీ పెళ్లి గురించి ! నరేష్ సార్ ఈజ్‌ నాటీ అని పదేపదే అంటుంటారు ఫ్యాన్స్.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 04:45 PM IST

కొత్తఏడాదికి స్వాగతం చెప్తూ.. డిసెంబర్‌ 31న నరేష్‌, పవిత్ర లిప్‌కిస్‌ వీడియో రిలీజ్ చేశారు. అక్కడితో ఆగారా అంటే.. ఆ తర్వాత పెళ్లి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోకు ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్ర, నరేశ్ అంటూ కాప్షన్‌ ఇచ్చారు. దాంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌ అయింది. ముందు ఆ వీడియోలు నిజమేనని అంతా అనుకున్నారు. తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేశ్, పవిత్ర. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆ వీడియోలను రిలీజ్ చేశారని తేలింది. ఆ సినిమానే మళ్లీ పెళ్లి. పవిత్ర, నరేశ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్నారు. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేశ్ నిర్మించారు. నరేశ్ తన జీవితంలో జరిగిన వివాదాలనే సినిమాగా చేస్తున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు.. హోటల్‌లో నరేశ్, పవిత్రా లోకేశ్ కనిపించడం.. రమ్యను చూస్తూ నరేశ్ విజిల్స్ వేసుకుంటూ వెళ్లడం.. ఇదంతా మీడియా ఎదుటే జరగడం వంటి సన్నివేశాలతో టీజర్ మొత్తం నింపేశారు. మొత్తంగా రియల్‌ ఇన్సిడెంట్స్‌ని రీల్‌లోకి కన్వర్ట్‌ చేసినట్లుగా కనిపిస్తోంది. నరేశ్ మాజీ భార్య పాత్రలో తమిళ నటి వనిత విజయ్‌ కుమార్‌ నటించారు. బెంగళూరులో ఓ హోటల్‌లో మాజీ భార్యను చూస్తూ నరేశ్‌ విజిల్‌ వేయడం.. అప్పట్లో వైరల్ అయింది. ఇప్పటికీ ఆ స్క్రీన్‌షాట్స్ కనిపిస్తూనే ఉంటాయ్ ఏదో ఒక చోట! ఇక ఓ టీవీ చానెల్‌కు నరేశ్‌ మాజీ భార్య ఇంటర్వ్యూ ఇవ్వగా.. దాన్ని కూడా వాడేశాడు. ప్రెస్‌మీట్‌ సీన్ పెట్టి.. తన భార్య అన్న మాటలను.. సినిమా డైలాగుల రూపంలో చెప్పించాడు. ఇలా టీజర్‌కు, రియల్‌లైప్‌కు కంపారిజన్ స్టార్ట్ అయింది. టీజర్‌లో చూపించినట్లు.. ఎండ్‌ ఆఫ్‌ ది డే.. నరేశ్, పవిత్ర రియల్ పెళ్లితో ఏకం అవుతారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.