Bramayugam: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన తాజా చిత్రం భ్రమయుగం. విడుదలైన తొలి రోజు నుంచే ఈ చిత్రం కేరళలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కడుమోన్ పొట్టి పాత్రలో మమ్మూట్టి నటన అద్భుతంగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడీ చిత్రం తెలుగులో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది.
Lokesh Kanagaraj: ఇద్దరు బడా స్టార్ల చాప్టర్ క్లోజ్ చేస్తానంటున్న దర్శకుడు
ఈ నెల 23న తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలోకి రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. నిజానికి ఈ సినిమా మలయాళంతోపాటే తెలుగులోనూ విడుదల కావాలి. కానీ, డబ్బింగ్ పనులు పూర్తవ్వకపోవడం వల్ల విడుదల వాయిదాపడింది. చివరకు ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. పూర్తి బ్లాక్ అండ్ వైట్‌లోనే ఈ చిత్రం విడుదలవ్వడం విశేషం. 18వ శతాబ్దం బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కించారు. హారర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన భ్రమయుగం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఇది థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అంటూ ప్రేక్షకులు, విమర్శకులు చెబుతున్నారు. ఇండియాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం ముగిసి కొన్ని దశాబ్దాలు కావస్తోంది.
ఇన్నాళ్లకు మళ్లీ ఒక సినిమా పూర్తి బ్లాక్ అండ్ వైట్‌లో విడుదలవ్వడం విశేషం. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత మార్చి నెలాఖరులో ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న భ్రమయుగం తెలుగులో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.