ఇండియాలోనే ట్యాక్స్ భారీగా కట్టే స్టార్స్ లిస్ట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మారుమోగేలా ఉందా? కాని ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్ లో కనీసం వీల్లిద్దరి పేర్లు లేవు. ఐతే వీళ్ల ఏడాది రెవెన్యూ చూస్తే ఇయర్లీ 90 కోట్లు కట్టే షారుఖ్ ఖాన్ కంటే, అమితాబ్ బచ్చన్ అండ్ కో కంటే భారీగా ఉంది.. ఇంకా చెప్పాలంటే సౌత్ లో ఎప్పుడు తమిళ స్టార్ విజయ్ పేరు మాత్రమే ఇండియా టాప్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్ లో సెకండ్ టాప్ గా నిలుస్తోంది. ఇక్కడే భారీగా డౌట్లకు గేట్లు తెరుస్తున్నాయి… దేవర కి 200 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్, వార్ 2 కి 300 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. ఆల్రెడీ 350కోట్ల స్టార్ గామారాడు. అలా చూసినా తన ఏడాది టాక్స్ 150 కోట్లు దాటాలి.. ప్రభాస్ ఆదాయ పన్ను కూడా 150 కోట్ల దాటాలి… కాని వీల్ల పేర్ల ప్రస్తావనే లేకుండా ఓ లిస్టొచ్చింది.. దానర్ధం ఏంటి?
ఇండియా లో కోట్లల్లో ట్యాక్స్ కట్టే స్టార్స్ లిస్ట్ మరోసారి సినీ జనాలను షాక్ కి గురిచేస్తోంది. లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టిన లిస్ట్ లోషారుఖ్ టాప్ ప్లేస్ లో ఉంటే, తమిళ విజయ్ సెకండ్ ప్లేస్ లోఉన్నాడు. ఈ ఎకనామికల్ ఇయర్ పూర్తకాక ముందే, అడ్వాన్స్ ట్యాకస్ పేమెంట్స్ లో మళ్లీ షారుఖ్, విజయ్ పేర్లే ఇండియా టాప్ వన్, టాప్ 2 ప్లేస్ లో వినిపిస్తున్నాయి
ఇక్కడే రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ పేర్లెందుకు మిస్సయ్యాయనే డిస్కర్షన్ మొదలైంది. ముందుగా ఈ ఎకనామికల్ ఇయర్ లో అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో ఎవరెంత కట్టారో లిస్ట్ చూస్తే, షారుఖ్ ఖాన్ 92 కోట్లు కట్టాడు. ధలపతి విజయ్ 80 కోట్ల పన్ను కడితే, సల్మాన్ 75 కోట్ల ట్యాక్స్ తో థర్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
ఇక అమితాబ్ బచ్చన్ 71 కోట్లు, క్రికెటర్ విరాట్ 66 కోట్లు, కరీనా కపూర్ 10 కోట్లు ఆదాయపన్నుని ముందుగానే కట్టేశారు. దీనికి కారణం వీళ్లు కమిటైన సినిమాలు, యాడ్స్ తాలూకు డీల్స్ ముందుగానే పూర్తయ్యాయి. అలా వచ్చిన డబ్బుకి వెంటనే ట్యాక్స్ కట్టాలి కాబట్టి, ప్రతీ అడ్వాన్స్ నుంచి 30శాతం పన్ను కట్టయ్యే వాళ్ల ఎకౌంట్ లకి మని వస్తుంది.. అలా వీళ్లు అంతా ఎమౌంట్ తో టాప్ ప్లేస్ లో ఉన్నారు
కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ కి దేశమే షాకయ్యే రేంజ్ రెమ్యునరేషన్ ఉన్నా ట్యాక్స్ లిస్ట్ లో వాళ్ల పేర్లు లేకపోవటానికి రీజనుంది.
ఒకటి వార్ 2 మూవీకి 350 కోట్లు, డ్రాగన్ కి 350 కోట్లు తీసుకుంటున్నా ఎన్టీఆర్ కి ఇప్పటి వరకు అడ్వాన్స్ రూపంలో 200 కోట్లే అందాయి.. అంటే 60 కోట్లే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మిగతా పెండింగ్ బ్యాలెన్స్ ని ఏరియా రైట్స్ రూపంలో సొంతం చేసుకున్నాడు కాబట్టి, వార్ 2, డ్రాగన్ రిలీజ్ అయ్యాకే వాటి ఎమౌంట్ దక్కుతుంది. అలా వచ్చిన ఎమౌంట్ కే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది
ఇక ది రాజాసాబ్ కి ఆల్ మోస్ట్ ఫ్రీగా పనిచేస్తున్నప్రభాస్, ఫౌజీకి 500 కోట్లు, స్పిరిట్ కి 600 కోట్లు తీసుకుంటున్నా, తన చేతికి అందిన అడ్వాన్స్ లు కేవలం 150 కోట్లే.. మిగతా ఎమౌంట్ తనకి ఓవర్ సీస్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఏపీ తెలంగాణ రౌైట్స రూపంలో దక్కాయి. కాబట్టి అవి పారితోషకాన్నేమించే ఛాన్స్ ఉన్నా, ఈ సినిమాలు వచ్చాకే, ప్రభాస్ కట్టాల్సిన ట్యాక్స్ లెక్కలు తెలుస్తాయి.. అలా చూస్తే ఖాన్లు కపూర్లే కాదు, దేశం మొత్తం పన్ను విషయంలో 300 కోట్లు ట్యాక్స్ కట్టి ప్రభాసే నెంబర్ వన్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. తర్వాత ప్లేస్ ఎన్టీఆర్ దే అని అంచనాల వల్ల తేలింది. కాబట్టే వీళ్ల పేర్లు లేకుండా ట్యాక్స్ పేయర్స్ లిస్ట్ వచ్చిందని క్లియర్ అవుతోంది.