వీరి మధ్య గొడవకు సరైన కారణం ఏంటో తెలియదు కానీ.. ఈ విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. ఇక ఈ గొడవ తర్వాత మంచు కుటుంబానికి సంబంధించిన వారందరూ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఇది పెద్ద గొడవేమి కాదు అంటూ కామెంట్లు చేశారు. మనోజ్ చిన్నవాడు ఆవేశంలో ఏదో షేర్ చేశాడు.. దీనిని ఇష్యూ చేయకండి అంటూ విష్ణు కూడా ఈ వీడియోపై రియాక్ట్ అయ్యాడు. ఐతే విష్ణుతో గొడవ తర్వాత మొదటిసారి మనోజ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులను షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. కళ్లముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండటం కన్నా పోరాడి ప్రాణాలు విడవడం మంచిది అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఆ తర్వాత క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అంటూ మరొక కొటేషన్ షేర్ చేశాడు. మీరు బ్రతకండి మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ దండం పెడుతున్నటువంటి ఎమోజిని తర్వాత షేర్ చేశాడు. ఇలా ఈయన వరుసగా పోస్టులు షేర్ చేయడంతో ఈ పోస్టులపై నేటిజన్స్ స్పందిస్తూ అన్న విష్ణు అన్నతో మరోసారి ఏమైనా గొడవపడ్డారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏమైనా ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. #ManchuManoj pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 25, 2023