ఇకనైనా మారు తమ్ముడు… మంచు విష్ణు సెన్సేషనల్‌ ట్వీట్‌

న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌కు విషెస్‌ చెప్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌కు విషెస్‌ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - January 2, 2025 / 09:14 PM IST

న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌కు విషెస్‌ చెప్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌కు విషెస్‌ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదే క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన న్యూ ఇయర్‌ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ” జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టంలో మీ పక్కనే ఉండే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కలలను నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్! జై శ్రీ రామ్! ” అంటూ పోస్టులో రాసుకొచ్చారు మంచు విష్ణు. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆస్తి విషయంలో జరిగిన వివాదం ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లేంతవరకూ వచ్చింది. ఇక ఆ తరువాత జల్‌పల్లి ఫాంహౌజ్‌లో జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. రాష్ట్రం మొత్తం రెండు రోజులు ఇదే హాట్‌ టాపిక్‌గా నడిచింది. దీంతో మంచు విష్ణు ఇప్పుడు తమ్ముడు మనోజ్‌ను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. మనోజ్ తన కలను నెరవేర్చుకునే సమయంలో కుటుంబం పాత్ర కూడా ఉందని, ఇప్పుడు అవన్నీ మరిచిపోయి కన్న తండ్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదనే యాంగిల్ లో ఈ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు. నెటిజన్స్‌ చేస్తున్న కాంమెట్స్‌ ఎలా ఉన్నా. కుటుంబంలో ఇలాంటి వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు మంచు విష్ణు చేసిన ట్వీట్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది.