Mangalavaram: దెబ్బకొట్టింది.. మంగళవారం మూవీకి వరల్డ్ కప్‌ ఎఫెక్ట్..

మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే రాబట్టింది. కానీ వరల్డ్ కప్‌ మాత్రం పెద్ద షాకిచ్చింది. ఆదివారం కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుందని మేకర్స్ భావించారు. కానీ ఆదివారం ఈ మూవీ కలెక్షన్లకు వరల్డ్ కప్ దెబ్బ పడింది.

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 04:17 PM IST

Mangalavaram: ప్రేక్షకులు చాలా కాలం నుంచి ఎదురుచూసిన సినిమాల్లో మంగళవారం ఒకటి. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడం, ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే రాబట్టింది. కానీ వరల్డ్ కప్‌ మాత్రం పెద్ద షాకిచ్చింది. ఆదివారం కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుందని మేకర్స్ భావించారు. కానీ ఆదివారం ఈ మూవీ కలెక్షన్లకు వరల్డ్ కప్ దెబ్బ పడింది.

TRISHA: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్పందించిన నితిన్.. మహిళా కమిషన్ నోటీసులు..

వరల్డ్ కప్ ఫైనల్ కారణంగా కలెక్షన్లు బాగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఏ చిన్న లేదా మధ్యస్థ బడ్జెట్ సినిమాకైనా మొదటి ఆదివారం ఉత్తమమైన రోజుగా ఉండాలి. కానీ ఈసారి ప్రపంచ కప్ ఫైనల్‌ నేపథ్యంలో మంగళవారం చిత్రానికి గట్టి దెబ్బ తగిలింది. మంగళవారం ఓపెనింగ్ రోజున రూ.2.2 కోట్ళ షేర్ వసూలు చేసింది. కానీ, 2వ రోజు నుంచి 50 శాతం కంటే తక్కువ కలెక్షన్స్ రావడంతో సినిమా గణనీయమైన డ్రాప్ చూసింది. ఆ తర్వాత మూడో రోజైన ఆదివారం వసూళ్లు బాగా తగ్గాయి. ఇది మేకర్స్‌కి గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆదివారం రూ.1 కోటి కంటే తక్కువ షేర్ వసూలు చేసింది. మొత్తం మొదటి వారాంతం ప్రపంచవ్యాప్తంగా షేర్ 5 కోట్ల రూపాయల పరిధిలో ఉంది. థియేట్రికల్ విలువ రూ.13 కోట్లు.

అయితే వరల్డ్ కప్ ఫైనల్ లేకుంటే ఈ సినిమా దాదాపు ఆదివారం రూ.3కోట్ల షేర్ వసూలు చేసి ఉండేది. కానీ ఇప్పుడు రూ.1 కోటి కంటే తక్కువ షేర్ వసూలు చేసి బయ్యర్లను చాలా రిస్క్‌లో పడేసింది. మరి వీక్ డేస్‌లో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. మంగళవారం బాగా ఆడకపోతే బయ్యర్లు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. మరి కలెక్షన్లు స్థిరంగా ఉంటాయా అనేది చూడాలి.