మొన్నటి వరకూ సినిమాలో క్యారెక్టర్ గెటప్స్ విషయంలో విమర్శలు వస్తే ఇప్పుడు సినిమాలో డైలాగ్స్ గురించి రచ్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు.. అసలు ఇది రామాయణమేనా అంటూ ఇంకొందరు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఆదిపురుష్‌ను విమర్శిస్తున్నారు. మేకర్స్ వచ్చి స్వయంగా వివరణ ఇచ్చినా ఈ విమర్శలు మాత్రం ఆగడంలేదు. దీంతో ఆదిపురుష్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో డైలాగ్స్ విషయంలో మార్పులు చేయనున్నట్టు ప్రకటించారు. ఏ డైలాగ్స్ విషయంలో విమర్శలు వస్తున్నాయో ఆ డైలాగ్స్‌ను మార్చుతున్నట్టు చెప్పారు.
కొత్త డైలాగ్స్‌తో మరో వారంలో కొత్త ప్రింట్ విడుదల చేస్తామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతశిర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఆదిపురుష్ సినిమాను ఈ విధంగా డిజైన్ చేయడానికి కారణాన్ని వివరిస్తూ ట్వీట్ చేశాడు. ట్వీట్ చివరలో..”మేము ఎంత వివరణ ఇచ్చినా చాలా మంది ఫ్యాన్స్ డైలాగ్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సినిమాలో కొన్ని డైలాగ్స్ మారుస్తున్నామంటూ చెప్పాడు. మరో వారం రోజుల్లో కొత్త డైలాగ్స్‌తో సినిమాను విడుదల చేస్తామంటూ ట్వీట్ చేశాడు.
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023