Mansoor Ali Khan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ తాజాగా ఆమెకు క్షమాపణలు తెలిపాడు. అయితే, ఈ విషయం తాజాగా కీలక మలుపు తిరిగింది. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన మెగాస్టార్ చిరంజీవితోపాటు, హీరోయిన్ త్రిష, నటి ఖుష్బూపై కేసు పెడతానంటున్నాడు మన్సూర్ అలీఖాన్. దీంతో ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు సినిమాలలో చాలా రేపు సీన్లు చేశా.
BARRELAKKA: బర్రెలక్క.. నేటి గాంధీ.. ఆర్జీవీ సంచలన ట్వీట్.. ఎవరినీ వదలవా వర్మా..
కానీ త్రిషతో అలాంటి సీన్లలో నటించలేదు. లియోలో అ ఆవకాశం వస్తుందని అనుకున్నా. కానీ అది జరుగలేదు” అని చెప్పాడు. దీంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియో త్రిష దృష్టికి రావడంతో ఆమె మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నట్లు, భవిష్యత్తులో అతడితో కలిసి నటించకూడదని భావిస్తున్నట్లు త్రిష పేర్కొంది. ఈ అంశం సంచలనం కావడంతో పలువురు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు స్పందించారు వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా చిరంజీవి ఈ అంశంపై స్పందించారు. త్రిషకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఆయన కూడా మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. నటి ఖుష్బూతోపాటు, తమిళ నడిగర్ సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే, నిషేధం విధిస్తామంటూ మన్సూర్‌కి నోటీసులు ఇచ్చింది. అయిన్పటికీ తన వ్యాఖ్యల్లో తప్పులేదని, త్రిషకు క్షమాపణ చెప్పే ఉద్దేశం తనకు లేదని మన్సూర్ అన్నారు.
తర్వాత విషయం పెద్దది అవ్వడం, త్రిష బాధపడటంతో చివరకు క్షమాపణలు చెప్పాడు. అయితే, తనపై చిరంజీవి, ఖష్బూ, త్రిష చేసిన వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేశాయని, మానసిక వేదనకు గురి చేశాయని అంటూ వారిపై కేసు పెడతానని మన్సూర్ వ్యాఖ్యానించాడు. వారి వల్ల అశాంతికి గురయ్యానని, అల్లర్లు, పరువు నష్టం, క్రిమినల్, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అంశాలపై కోర్టులో కేసు వేస్తానని, త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు నోటీసులు పంపిస్తున్నానని పేర్కొన్నాడు. మరి ఈ అంశం ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.