ఎప్పుడూ వార్తల్లో ఉండే టాలీవుడ్ సెలబ్రిటీల్లో సమంత టాప్‌లో ఉంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు అయినా.. విభేదించిన తీరు అయినా.. ప్రతీసారి హాట్‌టాపిక్‌గానే ఉంటుంది సమంత. నాగ చైతన్యనను పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిరోజులకే బంధానికి బ్రేక్ చెప్పింది సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ సోలో లైఫ్ సాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్య మయొసైటిస్ బారినపడి.. దాని నుంచి కోలుకొని, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న గ్యాప్ కూడా తీసుకుంది. ఇలాంటి టైమ్‌లో ఎవ్వరూ రెండో పెళ్లి ఆలోచన చేయరు. ఇదే విషయాన్ని సమంత పరోక్షంగా చెప్పింది. తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో కాసేపు చాట్ చేసింది సమంత. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. చాటింగ్‌లో ఓ నెటిజన్ నేరుగా రెండో పెళ్లిపై ప్రశ్న సంధించాడు. పైగా కి డివోర్స్ స్టాటిస్టిక్స్ అంటూ కొంత డేటాను కూడా షేర్ చేశాడు. అందులో మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు విడాకుల రేటు 50 శాతంగా ఉందని రెండోసారి, మూడోసారి పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు ఆ రేటు మరింత పెరిగిందంటూ ఉంది. దీన్ని షేర్ చేస్తూ, మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించాడు. దీనికి సమంత అద్భుతమైన రియాక్షన్ ఇచ్చింది. డేటా ప్రకారం.. పెళ్లి అనేది సరైన పెట్టుబడి కాదంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక 2023ను వరస్ట్ ఇయర్ గా చెప్పిన సమంత.. వచ్చే ఏడాది తన ప్రాధాన్యం ఆరోగ్యానికేనంటూ ప్రకటించింది. అటు నాగచైతన్య కూడా రీసెంట్‌గా తన పెళ్లిపై దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రీసెంట్‌గా సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న చైతూ.. తన ఆలోచనలన్నీ సినిమా గురించే ఉన్నాయి తప్ప, పెళ్లి గురించి లేవంటూ ప్రకటించాడు.