PRABHAS: మారుతి కొంపముంచుతున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్

మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేస్తున్న రాజా డీలక్స్ కూడా 30 శాతం పూర్తైంది. అయితే, ఇప్పుడు ప్రభాస్ కోసం మారుతి, నాగ్ అశ్విన్ మధ్య చిన్న పాటి యుద్దమే జరిగేలా ఉందట. నాగ్ అశ్విన్ తీసుకున్న నిర్ణయం వల్లే మారుతి మూవీకి ఇబ్బంది వచ్చేలా ఉందట.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 06:25 PM IST

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీని తీస్తున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇది 80 శాతం షూటింగ్ పూర్తైంది. ఇక మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేస్తున్న రాజా డీలక్స్ కూడా 30 శాతం పూర్తైంది. అయితే, ఇప్పుడు ప్రభాస్ కోసం మారుతి, నాగ్ అశ్విన్ మధ్య చిన్న పాటి యుద్దమే జరిగేలా ఉందట. నాగ్ అశ్విన్ తీసుకున్న నిర్ణయం వల్లే మారుతి మూవీకి ఇబ్బంది వచ్చేలా ఉందట. ప్రభాస్ మోకాలి సర్జరీ వల్ల కల్కి 2898 ఏడీ పెండింగ్ షూటింగ్ చేయలేకపోయాడు ప్రభాస్.

ALLU ARJUN: ఫ్యాన్స్ కోసం కోట్లు వదులుకున్న బన్నీ.. అసలు కారణమిదే..!

ఇప్పుడు చూస్తే సలార్ రిలీజ్ దగ్గర పడింది. అది విడుదలైన నెల వరకు కూడా ప్రభాస్ అందుబాటులో ఉండేలా లేడు. అందుకే కల్కి మూవీ పెండింగ్ షూటింగ్ ఫిబ్రవరిలో పెట్టుకునేలా ఉన్నారట. అదే జరిగితే గ్రాఫిక్స్ వర్క్ డిలే అవ్వొచ్చు. అదే జరిగితే మే 9కి కల్కి 2898 ఏడీని రిలీజ్ చేయకపోవచ్చు. అందుకే దసరా సీజన్‌కి వాయిదా వేసేందుకు బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకున్నాడట. ఇక్కడే సమస్య వచ్చింది. ఎందుకంటే నాగ్ అశ్విన్ మూవీకి, మారుతి సినిమాకి కనీసం 6 నెలల గ్యాప్ ఉండాలి. కాబట్టి వచ్చే దసరాకు అనుకున్న మారుతి మూవీని 2025కి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అలా జరిగితే అంతవరకు మారుతి ఈ సినిమాతోనే ట్రావెల్ అవ్వాలి.

కానీ, మెగాస్టార్ నుంచి మారుతికి బంపర్ ఆఫర్ వచ్చింది. మారుతి అందుబాటులో లేకపోతే అనిల్ రావిపుడి లేదా త్రివిక్రమ్‌కి చిరు.. ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలాగైతే మారుతికి మెగా ఆఫర్ పోయినట్టే. ఇలాంటి లింకులు, లిటికేషన్లు ఉన్నాయి కాబట్టి.. కల్కి వాయిదా పడొద్దని సగటు ప్రభాస్ అభిమానికంటే మారుతినే ఎక్కువ కోరుకుంటున్నాడు.