ఈ సినిమాకోసం అందరూ ఫాలో అవుతున్న ట్రెండ్‌ను మొదటి సారి ఫాలోఅవుతున్నాడు రవితే. సాధారణంగా తన సినిమాలకు రవితేజ పెద్దగా ప్రమోషన్స్ చేయడు. కంటెంట్ బాగుంటే హిట్ అవుతుంది అనుకుంటాడో.. లేక ప్రమోషన్స్ అంటే నచ్చదో తెలియదు కాని. చాలా సింపుల్‌గా రవితేజ సినిమాలు వస్తాయి. కానీ లాస్ట్ టైం వచ్చిన ధమాకా సినిమాకు మాత్రం ప్రొడ్యుసర్స్, డైరెటర్ల సలహాతో ప్రమోషన్స్ నిర్వహించాడు ఈ స్టార్. నిజానికి ఇప్పుడు ఈ ట్రెండే కొనసాగుతోంది. సినిమాకు ఎంత ప్రియార్టీ ఇస్తారో.. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా అంతే ప్రియార్టి ఇస్తున్నారు మేకర్స్. టార్గెట్ బిజినెస్ ఏరియాస్‌కి స్వయంగా వెళ్లి ప్రమోట్ చేసుకుంటున్నారు.
సినిమా ప్రమోషన్స్‌ను కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కలిపేశారు. ధమాకా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. సినిమా హిట్ అయ్యేందుకు ప్రమోషన్స్ ఓ రకంగా కారణమయ్యాయి. దీంతో ఇప్పుడు రావణాసుల సినిమాకు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు రవితే. త్వరలోనే తన సినిమా కోసం ప్రమోషన్స్ చేసుకునేందుకు రంగంలోకి దిగబోతున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. 3 నెలల గ్యాప్‌లోనే రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ‘రావణాసుర’పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.