Ravi teja : మ‌రో కొత్త డైరెక్ట‌ర్‌తో మాస్ మ‌హ‌రాజా..

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో (Star Hero), మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో (Star Hero), మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. చివ‌రిసారిగా ఆయ‌న ఈగిల్ మూవీ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇందులో ఆయ‌న సూప‌ర్ పెర్ఫార్మెన్స్‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. అయితే.. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. ప్ర‌జెంట్ మాస్ మ‌హ‌రాజా త‌న నెక్ట్స్ మూవీ మిస్ట‌ర్ బచ్చ‌న్‌పై కాన్స‌న్‌ట్రేట్ చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ త‌ర్వాత ర‌వితేజ వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మాస్ మ‌హ‌రాజా అప్‌క‌మింగ్ మూవీస్‌పై ఓ లేటెస్ట్ బ‌జ్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

మాస్ మ‌హ‌రాజా ఈ మ‌ధ్య కాలంలో ఆల్‌మోస్ట్ అన్నీ యాక్ష‌న్ సినిమాలే చేస్తున్నాడు.. అయితే అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఒక్క‌టీ స‌రైన హిట్‌ను ఇవ్వ‌లేదు.. గతంలో క్రాక్ తర్వాత ఇప్పటివరకు రవితేజ ఆరు సినిమాలలో నటించాడు. అందులో ధమాకా ఫుల్ లెంగ్త్ యాక్షన్ కాదు, కామెడీ, శ్రీలీల డ్యాన్సులు బాగా వర్కౌట్ అయి హిట్ అయిందని చెప్పొచ్చు.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మొత్తం అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. ర‌వితేజ మ‌ళ్లీ రూటు మార్చిన‌ట్లు తెలుస్తోంది.

ర‌వితేజ కామెడీ టైమింగ్ అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. దీంతో.. త‌న‌కు బాగా అచ్చొచ్చిన కామెడీ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోన‌ర్‌నే మ‌ళ్లీ మాస్ మ‌హ‌రాజ్ న‌మ్ముకున్న‌ట్లు తెలుస్తోంది. యాక్షన్ సినిమాలు కలిసి రావట్లేదని మళ్ళీ తన ఫేవరేట్ జోనర్, తనకి బాగా కలిసొచ్చిన జానర్ కామెడీకి షిఫ్ట్ అవుతున్నాడట..ఈ క్ర‌మంలోనే తాను చేయ‌బోతున్న సినిమాల్లో మరొక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. గతేడాది సామజవరగమన చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కి భాను బోగవరపు కథ అందించారు. అయితే ఇతన్ని దర్శకుడు గా పరిచయం చేయనున్నట్లు టాక్.. భాను బోగవరపు ఆల్రెడీ రవితేజకి ఓ కామెడీ కథ చెప్పిట్లు సమాచారం.. మ‌రి.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే..