Mega family food business : మెగా ఫ్యామిలీ ఫుడ్‌ బిజినెస్‌.. చిరంజీవి ఇంటి నుంచే సప్లై

రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా కుటుంబానికి ప్రజల్లో ఉండే ఆదరణ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇంటినిండా హీరోలున్నా ఎప్పుడు హీరోల్లా ఫీల్‌ అవ్వని యాటిట్యూడ్‌ వాళ్లది. డౌన్‌ టూ ఎర్త్‌ ఉంటారు కాబట్టే అభిమానులకు మెగా కుటుంబమంటే అంత పిచ్చి. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా మెగాహీరోలకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా కుటుంబానికి ప్రజల్లో ఉండే ఆదరణ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇంటినిండా హీరోలున్నా ఎప్పుడు హీరోల్లా ఫీల్‌ అవ్వని యాటిట్యూడ్‌ వాళ్లది. డౌన్‌ టూ ఎర్త్‌ ఉంటారు కాబట్టే అభిమానులకు మెగా కుటుంబమంటే అంత పిచ్చి. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా మెగాహీరోలకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. అలాంటి మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఫుడ్‌ బిజినెస్‌లోకి ఎంటర్‌ కాబోతోంది. అత్తమ్మాస్‌ కిచెన్‌ పేరుతో కొత్త క్లౌడ్‌ కిచెన్‌ ప్రారంభించబోతున్నట్టు మెగా కోడలు ఉపాసన తెలిపారు. మెగాస్టార్‌ సతీమని సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఉపాసన.

తాము ప్రారంభించబోయే కిచన్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశారు. అత్తమ్మాస్‌ కిచెన్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలి అనుకున్నవాళ్లు ఈ వెబ్‌సైట్‌ నుంచి ఆర్డర్‌ చేసుకోవచ్చు. క్వాలిటీ, శానిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైస్‌ కాకుండా కిచెన్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు ఉపాసన. కస్టమర్లు ఆర్డర్‌ చేసుకున్న ఫుడ్‌ తమ కిచెన్‌ నుంచి తన ఏజెంట్స్‌ నేరుగా కస్టమర్లకు అందిస్తారని చెప్పారు. అయితే అన్ని హోటల్స్‌లో దొరికినట్టు ఇక్కడ అన్ని రకాల ఫుడ్‌ ఐటెమ్స్‌ దొరకవు. రెడీ టూ మిక్స్‌ ఫుడ్స్‌ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. రెడీ టూ మిక్స్‌ పులిహోర, రెడీ టూ మిక్స్‌ ఉప్మా రవ్వా ఇలా అన్ని నిమిషాల్లో కలుపుకుని తినేసే ఫుడ్స్‌ మాత్రమే అందుబాటులో ఉంచబోతున్నట్టు చెప్పారు. ఈ న్యూస్‌ చూడగానే మెగా ఫ్యాన్స్‌ అంతా తెగ సంతోష పడిపోతున్నారు. మెగా కిచెన్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్లు పెట్టేస్తున్నారు.