హే దేవర ఇదెక్కడి టెన్షన్… ఎన్టీఆర్ వల్ల మెగా కష్టాలేనా..?

దేవర ట్రెండ్ బెండ్ తీసే రికార్డులతో దూసుకెళ్లాడు. ఇంకా దూసుకెళుతూనే ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లో తనతో కలిసి నటించటమే కాదు, రియల్ లైఫ్ లోకూడా ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండే అయినా చరణ్ కి దేవర వల్ల కష్టాలు తప్పట్లేదు. ఆల్రెడీ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా తనకు మరోరికార్డు క్రియేట్ అయ్యింది.

  • Written By:
  • Updated On - October 18, 2024 / 01:25 PM IST

దేవర ట్రెండ్ బెండ్ తీసే రికార్డులతో దూసుకెళ్లాడు. ఇంకా దూసుకెళుతూనే ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లో తనతో కలిసి నటించటమే కాదు, రియల్ లైఫ్ లోకూడా ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండే అయినా చరణ్ కి దేవర వల్ల కష్టాలు తప్పట్లేదు. ఆల్రెడీ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా తనకు మరోరికార్డు క్రియేట్ అయ్యింది. భారీ ఓపెనింగ్స్ తో కూడా చరిత్ర స్రుష్టించాడు ఎన్టీఆర్. ఐతే ఇప్పుడు ఓవర్ సీస్ లో మిలియన్ల కొద్ది డాలర్స్ తో కూడా రికార్డులు క్రియేట్ చేసేశాడు. ఒకటి తర్వాత ఒకటి అలా పేరుకుంటూ పోతూనే ఉన్నాయి. దీంతో సంక్రాంతికి సోలో రిలీజ్ లేని గేమ్ ఛేంజర్ కి టాలీవుడ్ లో పోటీ తప్పట్లేదు. బాలీవుడ్, కోలీవుడ్ లో భారీ వసూళ్లు వస్తే తప్ప ఇక్కడ తన సీన్ మారదు.. ఓవర్ సీస్ లో హైప్ లేకపోవటంతో , దేవర రికార్డులు బద్దలు కొట్టడం కాదు, రీచ్ అవ్వటమే కష్టం అంటున్నారు. దీనికి తోడు శంకర్ తీసిన భారతీయుడు 2 ఫ్లాప్ అవటంతో, సేమ్ డైరెక్టర్ మేకింగ్ లో వస్తోంది కాబట్టి, గేమ్ ఛేంజర్ కి కష్టాలు తప్పట్లేదు. మరి ఇన్ని టెస్టులని చరణ్ పాస్ అవ్వగలడా? ఇది దేవర రికార్డుల వల్ల తనకి ఈ పరీక్ష మరింత కష్టతరమౌతోందా?

పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వగానే ఓటీటీ సునామీ మొదలైంది. ఏ సినిమా కైనా శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, ఆతర్వాత ఓవర్ సీస్ రైట్స్ ఎక్స్ ట్రా ప్రాఫిట్ గా మారుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ డిమాండ్ లేదు. ఓటీటీ బ్యాచ్ కండీషన్స్ పెట్టడంతో అక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ పట్టే పరిస్థితి లేదు. ఆడియో రైట్స్ మరీ వందలకోట్లు రాబట్టవు కాబట్టి, ఇక మిగిలంది ఓవర్ సీస్ రైట్సే.. అక్కడ వసూళ్లు ఎంతగా రాబడితే, అంతగా ఆ సినిమా హీరో కొత్త మూవీకి ఓవర్ సీస్ రైట్స్ మతిపోగొట్టే ఛాన్స్ ఉంది

అలా చూస్తే ఇప్పటి వరకు ఓవర్ సీస్ లో నెంబర్ వన్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే.. తన బాహుబలి 2 సినిమాకు యూఎస్ లో 20మిలియన్ డాలర్లకు పైనే వసూల్లు వచ్చాయి. తర్వాత ప్లేస్ లో కూడా ప్రభాస్ మూవీ కల్కీనే ఉంది. ఈ సినిమాకు 18. 5 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆతర్వాత 15 మిలియన్ డాలర్ల వసూళ్లతో మూడో స్తానంలో ఉంది త్రిబుల్ ఆర్…

ఇక యూఎస్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల్లో నాలుగోస్థానంలో బాహుబలి మొదటి భాగం ఉంది. 8,9 మిలియన్లతో ఇది నాలుగో స్తానంలో ఉంటే, సేమ్ కలెక్షన్స్ తో సేమ్ ప్లేస్ ని రిప్లేస్ చేసింది దేవర మూవీ..అంటే యూఎస్ లో భారీ వసూల్లు రాబట్టిన తెలుగు సినిమాల లిస్ట్ లో మూడు ప్రబాస్ మూవీలుంటే, రెండు ఎన్టీఆర్ సినిమాలున్నాయి. ఇక రామ్ చరణ్ మాత్రం త్రిబుల్ ఆర్ తర్వాత ఆరేంజ్ ని అందుకోడానికి గేమ్ ఛేంజర్ తో వస్తున్నాడు.

సో త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్ తో కలిసి పాన్ వరల్డ్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత,తనేం చేసినా చరణ్ చేస్తాడా? ఆ రేంజ్ అందుకుంటాడా అన్న ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ కంపేరిజనే మెగ గ్లోబల్ స్టార్ ని ఇరిటేట్ చేసేలా ఉంది. దీనికి తోడు 172 కోట్ల దేవర ఓపెనింగ్స్ కూడా గేమ్ ఛేంజర్ కి అడీషనల్ హెడ్డేకే. ఆల్రెడీ దేవర తర్వాత పుష్ప 2 తో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యేలా ఉన్నాయి. అవి కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి ఛాలెంజ్ గా మారేలా ఉన్నాయి.

అసలే గేమ్ ఛేంజర్ మూవీకి టైం బాలేదు. శంకర్ వరుసగా నన్బన్, ఐ, రోబో2.0 తో ఫ్లాపులు ఫేస్ చేశాడు. ఇక భారతీయుడు 2 అయితే డిజాస్టర్ అని తేలింది. కాబట్టే, అలాంటి డైరెక్టర్ మేకింగ్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సునామీ క్రియేట్ చేయటం అటుంచితే, హిట్ మెట్టెక్కడమే కష్టమంటున్నారు. అందుకే డిసెంబర్ లో రావాల్సిన గేమ్ ఛేంజర్ ని సంక్రాంతికి వాయిదా వేశారు. సో కథ శంకర్ ది కాదు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ అందించాడు కాబట్టే, ఆ ఒక్క హోప్ తోనే ఏదైనా మ్యాజిక్ జరిగితే జరగొచ్చనంటున్నారు. కాని త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్యతోఫ్లాప్ ఫేస్ చేసిన చరణ్, గేమ్ చేంజర్ తోఅయినా ప్రూవ్ చేసుకుంటాడా అనుకుంటే, అందుకు ముందే దేవర క్రియేట్ చేసిన రికార్డులు ఛాలెంజ్ విసురుతున్నాయి. పుష్ప 2 క్రియేట్ చేసే రికార్డులతో మరిన్ని ఛాలెంజులు రెడీఅయ్యేలా ఉన్నాయి.