అనుకున్నదే జరిగింది. పుష్ప గాడు షాక్ ఇచ్చాడు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. నీయవ్వా తగ్గేదే లే అనే పుష్పా.. నీయవ్వ ఇప్పట్లో వచ్చేదే లే అన్నట్లు ఆగస్ట్ నుంచి డిసెంబర్‌కు వెళ్లిపోయారు. గ్రాఫిక్స్ బాగోలేదని.. కొన్ని సీన్లు రీషూట్ చేయాలని.. అందుకే రిలీజ్ పోస్ట్ అని మూవీ టీమ్ చెప్తున్నా.. అసలు కారణం వేరే ఉందనే టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ నుంచి బన్నీని కాపాడేందుకే.. సుకుమార్ మూవీని పోస్ట్ పోన్ చేశాడా అనే డిస్కషన్ వినిపిస్తోంది.
జనసేన (Janasena) ను, పవన్‌ను పట్టించుకోకుండా.. నంద్యాల (Nandyala) వైసీపీ (YCP) అభ్యర్థి ప్రచారం కోసం బన్నీ వెళ్లినప్పటి నుంచి మొదలైన రచ్చ.. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి.. సోషల్ మీడియాలో దెబ్బలాడేసుకుంటున్నారు. అది బన్నీ మూవీస్ మీద ఎఫెక్ట్ చూపించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సుకుమార్ తెలివిగా.. పుష్ప 2 రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశాడా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2 మూవీ గురించి మెగా అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప2 సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు నిర్మాతలు. సినిమా కలెక్షన్లకు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యం కావడంతో నిర్మాతల్లో కొత్త భయం పట్టుకుంది.
మెగా అభిమానులు సినిమాపై నెగిటివ్ టాక్ తీసుకువస్తే పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన చిత్ర యూనిట్… కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అభిమానుల్లో ఈ వేడి తగ్గేవరకు.. సినిమాని రిలీజ్ చేయకూడదని డైరెక్టర్ సుకుమార్ కూడా డిసైడ్ అయ్యారట. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఐతే ఇప్పుడు డిసెంబర్ ఆరుకు వాయిదా వేశారు. దీంతో బన్నీ కెరియర్ కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.