మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బేసిగ్గా తన తరం నటుల్లో, ది బెస్ట్ న్యాచురల్ స్టార్… కాకపోతే ఆ బిరుదు నానికి ఆల్రెడీ దక్కింది. ఎంత న్యాచురల్ గా ఎన్టీఆర్ నటించినా తన మాస్ ఇమేజ్ వేరు. మార్కెట్ రేంజ్ వేరు.. కాబట్టి న్యాచురల్ స్టార్ కంటే యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిలే తనకి పర్ఫెక్ట్… అందుకే మాస్ ఇమేజ్ కోసం ఎన్టీఆర్ వెళ్లే దారినే చాలామంది జూనియర్స్ ఇమిటేట్ చేయటం కామనైంది. ఐతే తన హిట్ల ను చూసో, సక్సెస్ రేటుని చూసో తోటి హీరోలు అసూయ పడటం కామన్ … కాని సెట్లోనే తనని పక్కనే చూస్తూ జలస్ ఫీల్ అయ్యానన్నాడు గ్లోబల్ స్టార్. త్రిబుల్ ఆర్ షూటింగ్ లో జరిగిన ఈ సీన్ ని డాక్యుమెంటరీలో రిలీజ్ చేశారు. ఇప్పుడా మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఎన్టీఆర్ తనకి ఎంత ఫ్రెండైనా ఒక సీన్ లో మాత్రం తారక్ ని చూసి ఈర్శ పడకుండా ఉండలేకపోయానన్నాడు… విచిత్రం ఏంటంటే ఈ టోటల్ డాక్యుమెంటరీ లో ఈ మాటలే సెన్సేషనలయ్యాయి…
త్రిబుల్ ఆర్ మూవీ షూటింగ్, ప్లానింగ్ ఇలా మొత్తం ఈ ప్రాజెక్ట్ తాలూకు డాక్యుమెంటరీ వచ్చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంది. ఐతే ఈ సినిమాలో దర్శక నిర్మాతలు, హీరోలు మిగతా కాస్ట్ అండ్ క్రూ పడ్డ కష్టాలు చూపించారు. ఇబ్బందులు, మేకింగ్ టెక్నిక్స్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. కాని అన్నీంటికంటే ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ అన్న మాటలే తూటాల్లా సెన్సేషన్ అవుతున్నాయి
నిజానికి త్రిబుల్ ఆర్ లో చరణ్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి, కొమరం భీం పాత్రకు స్కోప్ తగ్గించారని మొదట్లో అన్నారు. కాని ఈ పాత్ర ఎలా ఉందో, షూటింగ్ టైంలో ఆ పాత్రలో ఎన్టీఆర్ పెర్పామెన్స్ తనకి ఎలా అనిపించిందో చరణ్ చెప్పగానే, అసలు సీనే మారిపోయింది.
కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఎంతగా దిగిపోయినా, ఇంటర్వెల్ సీన్ లో ట్విస్ట్ ఎంతగా షాక్ ఇచ్చినా, అసలు అసూయ పడేలా చేసిందంటే పాటే అన్నాడు చరణ్. కొమరం భీముడో అంటూ ఎన్టీఆర్ పాడే ఒక్క పాటతో నిజంగా సినిమాలో ఎమోషనే మారిపోయింది.
అయితే ఇదంతా ఫైనల్ కట్ చూశాక జనానికి అనిపించటం కామన్. థియేటర్ లో సినిమా చూస్తూ జనం లీనమైపోతారు కాబట్టి ఇలా అనిపించొచ్చు.. కాని సెట్లో షూట్ చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ ని చూస్తే అసూయ పడ్డాడట చరన్. ఆ ఒక్క సాంగ్ షూటింగ్ కి ఎన్ని షాట్స్ తీశారు. ఎన్ని టేకులు తీసుకున్నారు. ఇలా అన్నీంట్లో తారక్ పెర్ఫామెన్స్ తోనే డామినేట్ చేశాడట. నిజంగానే ఆపాట కూడా థియేటర్స్ లో బాగా పేలింది.
కాకపోతే, అదే పాటలో కలిసి నటించారు కాబట్టి, దగ్గరనుంచి తారక్ ని చూసి తట్టుకోలేకపోయాయన్న రామ్ చరణ్ జెన్యూన్ రెస్పాన్స్ వైరలౌతోంది. ఈ డాక్యుమెంటరీ రీచ్ నే పెంచేసింది. ఎంతైనా తారక్ న్యాచురల్ పెర్ఫార్మర్ అని ఎప్పుటినుంచో బిరుదుంది. టెంపర్ సినిమాలో అయితే తన పెర్ఫామెన్స్ పీక్స్ అని అప్పట్లోనే మెచ్చుకున్నారు. జై లవకుశ, అరవింత సమేత వీరరాఘవలో చావు డైలాగ్, ఇలా పాత్రలో పాతుకుపోవటం తారక్ కి కొత్తకాదు. కాని కొమరం భీమం పాత్రలో తను పాడిన పాట, తన పెర్ఫామెన్స్ కి చరణ్ ఇస్తున్న రెస్పాన్స్ మాత్రం సోషల్ మీడియాను కుదిపేస్తోంది.