REVANTH REDDY: రేవంత్‌కు చిరు, పవన్ విషెస్.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది, ఆర్థిక ప్రగతి సాధించాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా, క్యాబినెట్, సీఎల్పీ నేతలకు శుభాకాంక్షలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

  • Written By:
  • Updated On - December 7, 2023 / 07:42 PM IST

REVANTH REDDY: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి వివిధ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మెగాస్టార్ చిరంజీవితోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, మంత్రులకు అభినందనలు తెలియజేశారు రాహుల్‌ గాంధీ.

REVANTH REDDY: శభాష్‌ రేవంత్‌.. చంద్రబాబు శుభాకాంక్షలు..

తెలంగాణలో ప్రజాసర్కార్‌ పని ఇప్పుడు మొదలైందని.. బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామని చెప్పారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. “తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది, ఆర్థిక ప్రగతి సాధించాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా, క్యాబినెట్, సీఎల్పీ నేతలకు శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ కూడా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఫరిడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ట్విట్టర్‌లో జగన్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కూడా రేవంత్‌కు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు” అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని హరీష్ రావు ట్వీట్ చేశారు.