వెదళం తెలుగు డబ్బింగ్ వర్షణ్ తెలుగు జనాలు చూశారు. కాబట్టి కథ మొత్తం తెలుసు.. అలాని వెదలం అద్భుతమైన కథా అంటే, తెలుగులో అప్పట్లో తులసి అంటూ వెంకీ చేసిన మూవీలానే ఉంటుంది ఈ మూవీ. అలానే మోహర్ రమేష్ లాంటి డైరెక్టర్ తీసిన మూవీ అవటం, ఇలా ఈ మూడు యాంగిల్స్ లో చూస్తే భోళా శంకర్ సినిమాకు హైప్ ఎందుకు పెరగట్లేదో చెప్పక్కర్లేదు.
అందుకే పవన్ మ్యానరిజమ్స్ తో చిరు అలా భోళా శంకర్ ని ప్రమోట్ చేస్తున్నాడనంటున్నారు. ఇక పవన్ బ్రో మూవీ టీజర్ పేలినా, ఎందుకనో ఈ సినిమాకు హైప్ రావట్లేదు. ఫిల్మ్ యూనిట్ కూడా పెద్దగా ప్రమోషన్ పెంచినట్టు లేదు. ఏదో 25 న ప్రీరిలీజ్ ఈవెంట్ అంటున్నారు కాని, ఈ పాటికే ఆ ఈవెంట్ జరిగి ఉండాలి.. మరి రీలీజ్ కి 3 రోజుల ముందంటే ఇది సరైన స్ట్రాటజీ కాదంటున్నారు. ఇలా చూస్తే హైప్ విషయంలో చిరు, పవన్ సినిమాలకే దిక్కులేదు, ఇక వరుణ్ తేజ్ గాంఢీవధార అర్జున, వైష్షవ్ తేజ్ ఆదికేశవ పరిస్తితి చెప్పక్కర్లేదు. ఏదేమైనా మెగా హీరోల 4 సినిమాలకు పెద్దగా హైప్ క్రియేట్ కావట్లేదు.