Hanuman: జై చిరంజీవ‌.. హ‌నుమాన్ చెడుగుడు.. వైర‌ల్‌గా మారిన చిరంజీవి వ్యాఖ్య‌లు

ఈ మూవీ విడుద‌ల‌కు ముందు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి వైర‌ల్‌గా మారాయి. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన చిరు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా బావుంటే, కంటెంట్ బాగుంటే ఫస్ట్ డే కాకపోతే రెండోరోజు చూస్తారు.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 04:21 PM IST

Hanuman: చిన్న సినిమాగా సంక్రాంతి బ‌రిలో నిలిచి.. పెద్ద సినిమాల‌కు షాకిచ్చింది హ‌నుమాన్ మూవీ. యంగ్ హీరో తేజా సజ్జా- టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ భారీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అస్స‌లు అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. గ్రాఫిక్స్.. బాహుబ‌లి రేంజ్‌లో ఉన్నాయ‌న్న‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవ‌ర్సీస్‌లోనూ అద‌ర‌గొడుతోంది.

GUNTUR KAARAM: గురూజీ ఎక్కడ..? త్రివిక్రమ్ లేకుండా గుంటూరు కారం సెలబ్రేషన్స్‌

దీంతో.. ఈ మూవీ విడుద‌ల‌కు ముందు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి వైర‌ల్‌గా మారాయి. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన చిరు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా బావుంటే, కంటెంట్ బాగుంటే ఫస్ట్ డే కాకపోతే రెండోరోజు చూస్తారు. లేదంటే ఆ నెక్స్ట్ డే, నెక్స్ట్ షో చూస్తారు అన్నారు. ఇప్పుడు హ‌నుమాన్ మూవీ సాధించిన ఘ‌న విజ‌యంతో చిరు కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. కంటెంట్, టేకింగ్ బావుంటే.. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలాగా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. కాగా.. ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్న‌ట్లు ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఓవ‌ర్సీస్‌లోనూ హ‌నుమాన్ చెడుగుడు ఆడేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 3.03 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ని హనుమాన్ మూవీ సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

చిన్న హీరోల సినిమాలలో ఇంత వేగంగా 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిత్రంగానూ రికార్డ్ సృష్టించింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన గుంటూరు కారం సినిమా కూడా ఓవర్సీస్‌లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ఇప్పటికీ సాధించలేదని తెలుస్తోంది. మూవీ టాక్ బాగుండటంతో థియేటర్స్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోందని బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతి బ‌రిలో నిలిచిన హ‌నుమాన్ చిన్న సినిమాల స‌త్తా ఏమిటో చాటుతున్నాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.