MEGASTAR CHIRANJEEVI: నేనున్నా.. నోరు జాగ్రత్త.. త్రిషకు చిరంజీవి సపోర్ట్‌..

త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసినా.. వివాదం ఆగడం లేదు. మరోవైపు త్రిషకు తాను క్షమాపణలు చెప్పబోనని మన్సూర్ అలీఖాన్ తెగేసి చెప్పాడు.

  • Written By:
  • Publish Date - November 21, 2023 / 02:41 PM IST

MEGASTAR CHIRANJEEVI: హీరోయిన్ త్రిషపై.. నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతూనే ఉంది. మన్సూర్ అలీఖాన్‌పై నడిగర్ సంఘం కన్నెర్ర చేస్తే.. జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. లైంగిక ఆరోపణలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 509 బి కింద మన్సూర్‌పై పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు. కాగా.. మెగాస్టార్‌ చిరంజీవి కూడా త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Trisha Krishnan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు..

మన్సూర్ వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్ట్‌లకే కాకుండా.. ఏ స్త్రీకి అయినా అసహ్యాన్ని కలిగించేలా ఉన్నాయని.. మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మన్సూర్‌ వంకర బుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడని ఫైర్ అయ్యారు చిరు. త్రిషకు, అలాంటి భయంకరమైన వ్యాఖ్యలకు లోబడే ప్రతి స్త్రీకి తాను అండగా ఉంటానని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ ప్రకటించారు చిరు. కాగా, ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మన్సూర్ అలీఖాన్ స్పందించారు. త్రిష, లోకేష్‌ కనగరాజ్‌ సీరియస్‌ అయ్యేసరికి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు మన్సూర్‌ అలీ ఖాన్. త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసినా.. వివాదం ఆగడం లేదు. మరోవైపు త్రిషకు తాను క్షమాపణలు చెప్పబోనని మన్సూర్ అలీఖాన్ తెగేసి చెప్పాడు. తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూనే.. తనకూ కొన్ని అనుమానాలున్నాయని వ్యాఖ్యానించాడు. తన వ్యాఖ్యలపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

తనకు మహిళలంటే గౌరవం ఉందని, గతంలో ఎంతో మంది మహిళలతో కలిసి పని చేసినట్లు చెప్పొకొచ్చాడు. రోజురోజుకు ఈ వివాదం ముదురుతుండడంతో.. ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.