Megastar Chiranjeevi: ఇది సార్‌.. మెగాస్టార్‌ రేంజ్‌..!

ట్రీట్‌ పూర్తయ్యాక బిల్‌ 40 లక్షలు అయ్యిందట. కానీ పొన్నంబలం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట హాస్పిటల్‌ సిబ్బంది. మొత్తం బిల్‌ చిరంజీవి కట్టేశారని చెప్పి పంపించేశాట.

  • Written By:
  • Updated On - March 17, 2023 / 01:55 PM IST

కేవలం మెగాస్టార్‌గానే కాదు. సాయం అన్నవాడికి చేయూతనిచ్చే మంచి మనిషిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఎన్నో సేవా కార్యక్రమాలు స్వయంగా ఆయన చేశారు.. తన అభిమానులతో చేయించారు. బ్లడ్‌బ్యాంక్‌, ఐబ్యాంక్‌తో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. అవసరంతో తన తలుపు తట్టిన ప్రతీ చిన్న యాక్టర్‌కు తాను అండగా నిలబడ్డాడు. తమిళ్‌లో మంచి పేరున్న విలన్‌ పొన్నంబలం.. చిరంజీవి నుంచి పొందిన సాయం గురించి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. అనారోగ్య సమస్యతో చిరంజీవి సహాయం కోరిన పొన్నంబలంకు జీవితంలో మర్చిపోలేని సాయం చేశాడట మెగాస్టార్‌. గతంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడుతూ చిరంజీవికి ఫోన్‌ చేశారట పొన్నంబలం. చేతిలో డబ్బు లేక ఆర్థిక సహాయం కోసం అడిగాడట. కనీసం లక్ష ఇచ్చినా చాలు అనుకున్న పొన్నంబలంకు జీవితంలో మర్చిపోలేని సాయం చేశాడట చిరంజీవి. చెప్పిన విషయం మొత్తం విని.. 5 నిమిషాల్లో నీకు అపోలో హాస్పిటల్‌ నుంచి కాల్‌ వస్తుంది.. రిపోర్ట్స్‌ సిద్ధంగా ఉంచుకో అంటూ కాల్‌ కట్‌ చేశాడట. ఆయన చెప్పినట్టుగానే అపోలో నుంచి డాక్టర్లు ఫోన్‌ చేశారట. డాక్టర్‌ అపాయింట్‌మెంట్ ఇచ్చి పొన్నంబలంను హాస్పిటల్‌కు షిఫ్ట్‌ చేశారట. ట్రీట్‌ పూర్తయ్యాక బిల్‌ 40 లక్షలు అయ్యిందట. కానీ పొన్నంబలం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట హాస్పిటల్‌ సిబ్బంది. మొత్తం బిల్‌ చిరంజీవి కట్టేశారని చెప్పి పంపించేశాట. చిరంజీవి స్థాయి ఏంటో చెప్పేందుకు ఈ ఒక్క ఎగ్జాంపుల్‌ చాలంటూ ఎమోషనల్‌ అయ్యారు పొన్నంబలం. ఈ విషయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఇది సార్‌ మా మెగాస్టార్‌ రేంజ్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేస్తున్నారు.