Chiranjeevi: చిరంజీవికి ఎప్పటికీ ఆ కోరిక తీరదా.. ఆ అసంతృప్తి ఇంకా వెంటాడుతూనే ఉందా?

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో అసామాన్య స్థాయికి చేరుకున్న చిరంజీవి జీవితంలో సాధించలేని దంటు ఏమీ లేదు. నటుడిగా.. స్టార్ గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆ స్థాయి ఎవరికీ దక్కలేదు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 02:39 PM IST

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో అసామాన్య స్థాయికి చేరుకున్న చిరంజీవి జీవితంలో సాధించలేని దంటు ఏమీ లేదు. నటుడిగా.. స్టార్ గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆ స్థాయి ఎవరికీ దక్కలేదు. మహేష్ బాబు మాటల్లో చెప్పాలంటే చిరంజీవి లాస్ట్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. ఇంక మిగిలిన వాళ్లంతా కేవలం హీరోలు మాత్రమే. ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని పొందారు చిరంజీవి. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎవరి అండ లేకుండా.. కులం బలం లేకుండా కేవలం కృషితో కష్టంతో.. ఎదిగినవాడు మెగాస్టార్.

సక్సెస్ లో ఎన్ని హైట్స్ చూసినా మెగాస్టార్ కి ఒక్క కోరిక మాత్రం తీరలేదు అది ఎప్పటికీ తీరుతుందో కూడా తెలియదు. ఆయనలో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. చిరంజీవి అంటే టక్ మనీ గుర్తొచ్చే పాత్ర తాను ఇప్పటికీ చేయలేకపోయానని చిరంజీవి అసంతృప్తి పడుతుంటారట. ఇది చాలా సన్నిహితుల దగ్గర ఆయన చాలాసార్లు షేర్ చేసుకున్నారు. అదిరిపోయే డాన్సులు ,స్టెప్పులు, ఫైట్లు
డైలాగ్ డెలివరీ ఇవన్నీ చిరంజీవి సొంతం. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏ హీరో దీని బీట్ చేయలేకపోయాడు. 155 సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ వేసిన చిరంజీవి మాత్రం ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అదేంటంటే ఎన్టీఆర్ అనగానే దానవీరశూరకర్ణ గుర్తొస్తాడు. ఆ రోల్ ఆ దుర్యోధనుడి పాత్ర ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని జనం బలంగా విశ్వసిస్తారు. ఏఎన్ఆర్ అనగానే దేవదాసు గుర్తొస్తాడు. ఆ పాత్ర ఆయన లాగా మరొకరు చేయలేరు అని జనం నమ్మకం. అలాగే కృష్ణ అనగానే అల్లూరి సీతారామరాజు అందరికీ గుర్తొస్తాడు. టాప్ హీరోలకు ఒక ల్యాండ్ మార్క్ రోల్ దొరికింది మిగిలిన ఎన్ని పాత్రలు చేసినా వాళ్లని జనం వెంటనే ఈ పాత్రతో గుర్తు పెట్టుకుంటారు.

కానీ దురదృష్టవసాత్తు చిరంజీవికి అలా వెంటనే గుర్తుపెట్టుకునే పాత్ర ఒకటి రాలేదు. ఖైదీ తో మొదలుపెట్టి భోళా శంకర్ వరకు ఎన్నో డిఫరెంట్ రూల్స్ ప్లే చేశాడు, కానీ ల్యాండ్ మార్క్ రోల్ మాత్రం చిరంజీవికి ఇప్పటికీ దక్కలేదు చిరంజీవి అనగానే మనకి టక్కమని ఒక రూపం ఒక స్పెసిఫిక్ రోల్ గుర్తుకు రాదు. అదే ఇప్పటికీ చిరంజీవి కెరీర్ లో మైనస్ గా ఉండిపోయింది సైరా మూవీ చేయడానికి కారణం కూడా అదే ఆ పాత్ర తనని అలాంటి ల్యాండ్ మార్క్ రోల్ గా మిగిలిపోతుందని చిరంజీవి భావించారు. కానీ ఆ సినిమా జనానికి ఎక్కలేదు. చిరంజీవి యాక్షన్ నప్పలేదు. ఇన్ని సినిమాలు చేసిన ఇప్పటికీ చిరంజీవికి అది తీరని కోరికగానే మిగిలిపోయింది. భవిష్యత్తులో ఏమైనా సాధ్యమవుతుందేమో చూడాలి.