Chiranjeevi: మెగా ప్లానింగ్.. సరికొత్త ఊహా ప్రపంచంలోకి చిరంజీవి..

మెగా 156 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్‌ పంచభూతాల థీమ్‌తో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట.

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 01:58 PM IST

Chiranjeevi: క‌మ్‌బ్యాక్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వ‌రుసే మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా ఆయ‌న ఫుల్ జోష్‌తో దూసుకెళ్తున్నారు. యంగ్ జ‌న‌రేష‌న్ హీరోలే ఆశ్చర్యపోయేలా వ‌రుసగా నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టి.. స‌వాల్ విసిరారు. అంతే కాదు.. గ్యాప్ లేకుండా వాటి షూటింగులు చేస్తూ షాక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ జోరుకు భోళాశంకర్ మూవీ బ్రేక్ వేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయే చిరంజీవి ఇప్పుడు స్లో అండ్ స్టడీ అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. బింబిసార చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్టతో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నారు.

VIRAT KOHLI: బయోపిక్స్ ట్రెండ్.. విరాట్ కోహ్లీ బయోపిక్‍..! హీరో ఎవరంటే.

మెగా 156 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్‌ పంచభూతాల థీమ్‌తో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట. అయితే ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్యను మ్యాచ్ చేయాలని అనుకుంటున్నాడట చిరు. అందుకే ఈ సినిమాపై ఫుల్ కాన్సట్రేషన్ పెట్టడంతో పాటు అభిమానుల ఆకలిని తీర్చాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడట మెగాస్టార్. సోషల్ మీడియాలో విశ్వంభర టైటిల్ చక్కర్లు కొడుతుండగా.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ రేంజ్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభరను సిద్ధం చేస్తున్నాడు వశిష్ట. షూటింగ్‌ ప్రారంభమే భారీ యాక్షన్‌ సీన్స్‌తో మొదలు కానుందట. ఈ కథలో ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఊహకందని యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయట.

పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన కథను సిద్ధం చేసిన వశిష్ట.. ఈ మూవీని నెవర్ బిఫోర్ అనేలా విజువల్ వండర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో డెబ్భై శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. ఈ హైలెవెల్‌ గ్రాఫిక్‌ వర్క్‌తో ఓ అద్భుత లోకాన్ని సృష్టించబోతున్నారట. ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్లడంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.