RAM CHARAN: రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిరంజీవి పోస్ట్‌..!

ఇప్పటికే గ్లోబల్‌ స్థాయి ఇమేజ్‌ దక్కించుకున్న రామ్‌ చరణ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌ ఇచ్చింది. వివిధ రంగాల్లో విశిష్ఠ కృషి చేసినవాళ్లకు వేల్స్‌ యూనివర్సిటీ ఇలా డాక్టరేట్‌ ప్రదానం చేస్తుంది.

  • Written By:
  • Updated On - April 13, 2024 / 08:25 PM IST

RAM CHARAN: ట్రిపులార్‌ సినిమా తరువాత రామ్‌ చరణ్‌ రేంజ్‌ మారిపోయింది. అప్పటి వరకూ ఇండియా వైడ్‌ ఫేమ్‌ తెచ్చుకున్న రామ్‌ చరణ్‌ను ట్రిపులార్‌ సినిమా గ్లోబల్‌స్టార్‌ను చేసింది. ఇదే ఊపులో వరుస సినిమాలు లైన్‌లో పెట్టి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు మన మెగా పవర్‌స్టార్‌. ఇప్పటికే గ్లోబల్‌ స్థాయి ఇమేజ్‌ దక్కించుకున్న రామ్‌ చరణ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.

Jr NTR: వార్‌ 2లో ఎన్టీఆర్‌దే డామినేషనా..? ఎన్ని గెటప్పుల్లో కనిపిస్తాడంటే..

చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌ ఇచ్చింది. వివిధ రంగాల్లో విశిష్ఠ కృషి చేసినవాళ్లకు వేల్స్‌ యూనివర్సిటీ ఇలా డాక్టరేట్‌ ప్రదానం చేస్తుంది. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ డాక్టరేట్‌ తీసుకున్నారు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. రామ్‌ చరణ్‌కు ఇంత గౌరవం దక్కడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పారు. ఒక తండ్రిగా తాను ఇంతకంటే ఏం కోరుకుంటానంటూ ఎమోషనల్‌ అయ్యారు. ప్రతీ తల్లిదండ్రులకు బిడ్డలు ఇలా ఎదుతుంటే చూడటం కంటే అదృష్టం మరొకటి ఉండదని కంగ్రాట్స్‌ డాక్టర్‌ రామ్‌ చరణ్‌ అంటూ పోస్ట్ చేశారు.

రామ్‌ చరణ్‌కు వేల్స్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేసి ఈ ఎమోషనల్‌ నోట్‌ రాశారు మెగాస్టార్. ఇక చెర్రీకి డాక్టరేట్‌ రావడంపై మెగా ఫ్యాన్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు. తండ్రికి తగ్గ కొడుకు అంటూ ట్విటర్‌లో రామ్ చరణ్‌కు కంగ్రాట్స్‌ చెప్తున్నారు.