Chiranjeevi: చిరంజీవి అలా యెందుకు చేశారు?

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రెండు సినిమాలు ఎనౌన్స్‌ చేశారు. మెగాస్టార్‌ నటించే 156.. 157 సినిమాలను ప్రకటించారు నిర్మాతలు. అయితే.. భోళా శంకర్‌ తర్వాత నటించే సినిమా గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. 156వ సినిమా దర్శకుడు ఎవరో తెలీయకుండా.. 157వ సినిమా డైరెక్టర్‌ని చెప్పడం షాక్‌ ఇచ్చింది. ఎందుకిలా చేశారని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 07:14 AM IST

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రెండు సినిమాలు ఎనౌన్స్‌ చేశారు. మెగాస్టార్‌ నటించే 156.. 157 సినిమాలను ప్రకటించారు నిర్మాతలు. అయితే.. భోళా శంకర్‌ తర్వాత నటించే సినిమా గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. 156వ సినిమా దర్శకుడు ఎవరో తెలీయకుండా.. 157వ సినిమా డైరెక్టర్‌ని చెప్పడం షాక్‌ ఇచ్చింది. ఎందుకిలా చేశారని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది. చిరంజీవితో సినిమా తీయాలనుకున్న దర్శకులు ఎప్పటికప్పుడు మారిపోతూ వుంటారు.

లైగర్‌ ఫ్లాప్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌కు ఛాన్స్‌ ఇచ్చినా.. ఈ మెగా ప్రాజెక్ట్‌ వర్కవుట్‌ కాలేదు. పూరీ ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ తీస్తున్నాడు. వెంకీ కుడుముల సినిమా ఎనౌన్స్‌ చేస్తే.. దర్శకుడు ప్రస్తుతం నితిన్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే.. అనుకోకుండా సోగ్గాడే చిన్నినాయన ఫేం కల్యాణ్‌ కృష్ణ.. బింబిసార ఫేం వశిష్ట తెరపైకి వచ్చారు. చిరంజీవి 156వ సినిమాను ఆయన పెద్ద కూతురు సుస్మిత గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసం.. తెరపైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి. తన తర్వాత సినిమాను మా బ్యానర్‌లో చేయడం ఆనందంగా వుందని నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. అంతా బాగానే వుందిగానీ.. దర్శకుడిగా కల్యాణ్‌ కృష్ణ పేరు బయటపెట్టలేదు. చాలాకాలంగా కల్యాణ్‌ పేరు వినిపిస్తున్నా.. పోస్టర్‌లో డైరెక్టర్‌ పేరు లేదు.

చిరంజీవి నెక్ట్స్‌ మూవీ డైరెక్టర్‌ ఎవరో చెప్పకపోవడం షాక్‌ ఇస్తోంది. భోళా శంకర్‌ డిజాస్టర్‌ డిస్టబ్‌ చేయడంతో.. రీమేక్స్‌కు దూరంగా వుండాలన్న స్ట్రాంగ్‌ డెసిషన్‌కు చిరు వచ్చాడట. మలయాళంలో హిట్టయిన బ్రో డాడీ రీమేక్‌లో నటించాలనుకున్న చిరు.. కల్యాణ్‌కృష్ణకు ఛాన్స్‌ ఇచ్చాడు. భోళా దెబ్బకు రీమేక్‌ కాకుండా.. ఫ్రెష్‌ స్టోరీ రాయమన్నాడని.. స్క్రిప్ట్ వర్క్‌ ఇప్పట్లో పూర్తికాదు కాబట్టి.. డైరెక్టర్‌ పేరు ఎనౌన్స్‌ చేయలేదని తెలుస్తోంది. కల్యాణ్‌ కృష్ణ చెప్పే కథ నచ్చితే సరే.. లేదంటే డైరెక్టర్‌ మారతాడు. చిరంజీవి 156వ సినిమాకు డైరెక్టర్‌ పేరు ప్రకటించకపోయినా.. ఆతర్వాత నటించే 157వ సినిమాను బింబిసార ఫేం వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడికి బింబిసార వంటి సూపర్‌హిట్‌ వుండడంతో.. రిస్క్‌ చేయడానికి రెడీ అయ్యాడట. రిస్క్‌ ఎందుకని రీమేక్‌ వద్దనుకున్న చిరంజీవి.. వశిష్టతో ప్రయోగం చేస్తున్నారు. చిరంజీవి 157వ సినిమాను యువి క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. బింబిసారను సోషియో ఫాంటసీగా తీసి హిట్‌ కొట్టిన వశిష్టపై నమ్మకంతో.. మెగాస్టార్‌ 19 ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’.. అంజి తర్వాత ఈ జానర్‌ టచ్‌ చేయని మెగాస్టార్‌ మళ్లీ ఇదే దారిలో వెళ్తున్నాడు.

అంజి మాదిరి దేవుడు.. మానవుడు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో చిరంజీవి 157 సినిమా వుంటుందట. దీనికి తగ్గట్టే.. పోస్టర్‌లో పంచేద్రియాలను చూపించాడు దర్శకుడు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ స్కోప్‌ వుండడంతో.. చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ కానుంది. 200 నుంచి 250 కోట్లు అవుతుందని టాక్‌. ఇలాంటి సినిమాల బడ్జెట్ పెరగడమే గానీ.. తగ్గడం వుండదు. 250 కోట్లతో మొదలుపెడితే.. 300 కోట్ల వరకు వెళ్తుంది. చిరంజీవితో ఇన్ని కోట్లు రిస్కే అయినా.. వశిష్ట చెప్పిన కథ నమ్మకం కలిగిస్తోందని.. పాన్‌ ఇండియాగా రిలీజ్‌ చేయడంతో.. 250 కోట్లు పెద్ద రిస్క్‌ కాదంటున్నారు మేకర్స్‌.