MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్‌.. ఇకపై కొత్త దారిలో చిరు..!

సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం రొటీన్ రోతతో తన ఇమేజ్‌కు తగ్గ మూవీలు చేయట్లేదనే కామెంట్స్ వచ్చాయి. ఖైదీ నెంబర్ 150 హిట్టవ్వొచ్చు. వాల్తేర్ వీరయ్య మాస్ హిట్ కావొచ్చు. కాని చిరు రేంజ్ మూవీలు కాదనే కామెంట్సే పేలాయి.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 07:30 PM IST

MEGASTAR CHIRANJEEVI: కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరినీ కలిపితే చిరంజీవి అంటారు. అటు పెర్ఫామెన్స్, ఇటు మాస్ ఇమేజ్‌తో రెండు దారుల్లో మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరు. దానిక్కారణం తన కెరీర్‌లో ఎన్నో మైల్‌స్టోన్స్‌తో మతిపోగొట్టే బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు. అలాంటి చిరు, సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం రొటీన్ రోతతో తన ఇమేజ్‌కు తగ్గ మూవీలు చేయట్లేదనే కామెంట్స్ వచ్చాయి.

PAWAN KALYAN: జనసేనానికి ఇబ్బంది తప్పదా.. గుర్తుతోపాటు పేర్లు కూడా..!

ఖైదీ నెంబర్ 150 హిట్టవ్వొచ్చు. వాల్తేర్ వీరయ్య మాస్ హిట్ కావొచ్చు. కాని చిరు రేంజ్ మూవీలు కాదనే కామెంట్సే పేలాయి. సరిగ్గా ఆడకున్నా గాడ్ ఫాదర్ లాంటి ప్రయోగమే కాస్త చిరు ఇమేజ్‌ని జస్టిఫై చేసే కంటెంట్ అన్నారు. సైరా నరసింహారెడ్డి లాంటి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగ్గ పనే అన్నారు. మరి అందుకే చిరు మారాడా..? లేదంటే విశ్వంభర కథ విన్నాకే తనలో మార్పొచ్చిందో కాని, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల లాంటి దర్శకులకు ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనకడుగు వేశాడు చిరు. తన కెరీర్‌లో ఎంతో చూసిన చిరు.. తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల లాంటి కామెడీ దర్శకులతో కితకితలు పెట్టాల్సిన పనిలేదు.

చేస్తే నెక్ట్స్ లెవల్ అనిపించే మూవీనే చేయాలి. అందుకే జగదేక వీరుడు అతిలోకసుందరి లాంటి కళా ఖండాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టున్నాడు. వివ్వంభర తర్వాత మూడు సినిమాలు పైప్ లైన్‌లో ఉన్నా అవన్నీ క్యాన్సిల్ చేసుకుని, తన ఇమేజ్ తగ్గ సినిమాల కోసం ఆగి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు.