Megastar Chiranjeevi: ఫిబ్రవరి నుంచి బరిలోకి దిగనున్న మెగా విశ్వంభర

మొన్నే అయోధ్యలో సందడి చేసిన చిరు, ప్రస్తుతం మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్నట్టు కనిపించాడు. హనుమాన్ మూవీ ప్రమోషన్‌లో కూడా చిరు కూర్చోవడానికే ప్రయారిటీ ఇచ్చాడు. అందుకే ఇంకా రిస్కీ షూట్‌కి రెడీ కాలేదన్నారు.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 07:00 PM IST

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేం వశిష్ట తీస్తున్న సినిమా విశ్వంభర. మోషన్ టీజర్ వచ్చింది. తర్వాత టైటిల్ టీజర్ వచ్చింది. రెండూ అంచనాలను పెంచాయి. కాని చిరు మాత్రం ఇంకా సెట్లో అడుగుపెట్టలేదు. కారణం మోకాలి సర్జరీ. మొన్నే అయోధ్యలో సందడి చేసిన చిరు, ప్రస్తుతం మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్నట్టు కనిపించాడు. హనుమాన్ మూవీ ప్రమోషన్‌లో కూడా చిరు కూర్చోవడానికే ప్రయారిటీ ఇచ్చాడు.

DEVARA-KALKI 2898 AD: ఏ సినిమా ఎప్పుడు రిలీజ్.. అంతా కన్ఫ్యూజన్..

అందుకే ఇంకా రిస్కీ షూట్‌కి రెడీ కాలేదన్నారు. ఏదేమైనా అయోధ్యలో చిరు సందడి చూసి తను కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఇక వశిష్ట కూడా విశ్వంభర రెగ్యులర్ షూటింగ్‌ని వచ్చే నెల నుంచి మొదలుపెట్టబోతున్నాడట. ఫిబ్రవరి, మార్చ్‌లో పూర్తిగా టాకీ సీన్లు తెరకెక్కించబోతున్నారు. ముందుగా గ్రాఫిక్స్ బేస్డ్ సీన్లను, యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కించి, తర్వాత మిగతా సీన్లు తీయాలనుకుంటున్నారు. కాని రిస్కీ సీన్లు చేసే పరిస్థితిలో చిరు లేరు.

కాబట్టి, తనకి ఇబ్బందిలేని సీన్లు వచ్చే రెండు నెలలు తీసి, ఆలోగా తను కోలుకుంటే, యాక్షన్ పార్ట్ తీయాలనుకుంటున్నాడట. మొత్తానికి ఫిబ్రవరి నుంచి బరిలోకి దిగనున్నాడు మెగాస్టార్. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి మూవీ రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు.