BHOLA SHANKAR: ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో భోళా శంకర్‌ చెత్త రికార్డ్‌.. మెహర్‌ను ఆడుకుంటున్న ఫ్యాన్స్..

భోళాశంకర్‌ సినిమా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో చెత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ అంటేనే మెగా ఫ్యామిలీకి బంగారు గని లాంటిది. మెగా హీరోల సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే ఇక్కడ ఫ్యాన్స్‌ హంగామా అంతా ఇంతా ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటూ ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు వస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 05:04 PM IST

BHOLA SHANKAR: ఇంతకు మించిన డిజాస్టర్‌ బాస్‌ నుంచి మళ్లీ రాదులే అనుకున్న ప్రతీ సారి ఫ్యాన్స్‌కు షాకిస్తున్నాడు మెగాస్టార్‌. ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్‌ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఆయన టైం అసలే బాలేదు అనుకుంటే ఆ దరిద్రానికి మెహర్‌ రమేష్‌ తోడయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చి భోళాశంకర్‌ సినిమా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో చెత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ అంటేనే మెగా ఫ్యామిలీకి బంగారు గని లాంటిది. మెగా హీరోల సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే ఇక్కడ ఫ్యాన్స్‌ హంగామా అంతా ఇంతా ఉండదు.

సింపుల్‌గా చెప్పాలంటూ ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు వస్తుంటారు. కానీ భోళా శంకర్‌ సినిమాకు మాత్రం చిరంజీవి జీవితంలో ఏ సినిమాకు ఎప్పుడూ రానంత తక్కువ కలెక్షన్‌ భోళా శంకర్‌ సినిమాకు వచ్చింది. చిరంజీవి కెరీర్‌లోనే డిజాస్టర్‌గా ఉన్న మృగరాజు సినిమా సైతం అక్కడ రూ.42 లక్షల గ్రాస్ సాధించింది. అది ఆ టైంలో.. టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ. ఆ తరువాత వచ్చిన ఆచార్య సినిమాకు రూ.65 లక్షల గ్రాస్‌ వచ్చింది. కానీ భోళా శంకర్ మాత్రం రూ.27 లక్షల వద్దే ఆగింది. ఇప్పుడు టికెట్‌ రేట్లు ఎక్కువగానే ఉన్నా.. కనీసం మృగరాజు కలెక్షన్స్‌ను కూడా దాటలేకపోయింది.

ఇది చిరు కెరీర్లోనే అత్యంత చెత్త రికార్డుగా మిగిలింది. ఇదంతా కూడా మెహర్ దయే అని మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. భోళా రిలీజ్ అయిన తరువాత మెహర్ రమేష్ ఎవ్వరికీ కనిపించడం లేదని టాక్. అసలు ఇప్పుడు మెహర్ ఎక్కడ ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. అండర్ గ్రౌండ్‌కి పోయాడా..? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.