Bholaa shankar: భోళా శంకర్ టీజర్‌తో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వబోయాడు. అంతవరకు బానే ఉంది కాని, భోళా శంకర్ మూవీ విషయంలో ఫ్యాన్స్‌కి రెండు భయాలు పెరిగాయి. కారణం చిరుకి సెకండ్ ఇన్నింగ్స్ లో రీమేక్స్ కలిసి రావట్లేదనే కంగారు ఒకటైతే, భోళా శంకర్ తీసే దర్శకుడు మరో కారణం.
చిరంజీవి కెరీర్‌లో 45 శాతం సినిమాలు రీమేక్స్‌గానే వచ్చాయి. అంటే ఆల్ మోస్ట్ 60కి పైనే సినిమాలు తను రీమేక్స్ చేశాడు. అందులో 55 హిట్లు.. సో అలాంటప్పుడు ఫ్యాన్సే కాదు మరెవరూ తమిళ వేదాళం తెలుగు రీమేక్ భోళా శంకర్ మీద భయాలు పెట్టుకోనక్కర్లేదనే అభిప్రాయం ఉంది. కాని కథలో మలుపేంటంటే, చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో రీమేక్స్‌కి సక్సెస్ రేటు ఫిఫ్టీ ఫిఫ్టీనే. పొలిటికల్ బ్రేక్ తర్వాత ఖైదీ నెంబర్ 150తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరు.. ఇప్పటికి 6 సినిమాలు చేస్తే అందులో రెండు రీమేక్సే ఉన్నాయి. కత్తి రీమేక్‌గా ఖైదీ నెంబర్ 150 వస్తే, లూసీఫర్ రీమేక్‌గా గాడ్ పాదర్ వచ్చింది. ఒకటి హిట్టు, మరొకటి ఫ్లాపు.
అందుకే ఇప్పుడొచ్చే భోళా శంకర్ కూడా రీమేక్ కాబట్టి, రిజల్ట్ కలిసొస్తుందా? రివర్స్ అవుతుందా అన్న కంగారు ఫ్యాన్స్‌లో పెరుగుతోంది. దీనికి తోడు ఫ్లాపుల మాస్టర్ మోహర్ రమేష్ తీస్తున్న మూవీ కాబట్టే ఫ్యాన్స్‌లో ఇంకా కంగారు పెరుగుతూనే ఉంది. కాకపోతే బిల్లా రీమేక్‌తో మోహర్ రమేష్ హిట్ మెట్టెక్కాడు కాబట్టి, అలా భోళా శంకర్ గట్టెక్కుతుందనే ఓదార్పు దొరుకుతోంది. ఏదేమైనా సెంటిమెంటల్ ఇండస్ట్రీ కాబట్టి, ఇలాంటి భయాలు తప్పవు.