MM Keeravani: ఆస్కార్ మూడ్ నుంచి బయటపడ్డ కీరవాణి.. మళ్లీ ఫుల్ బిజీ..

నా సామి రంగ కోసం కీరవాణి ట్యూన్స్‌ ఇచ్చే పనిలో వున్నారు. ఆల్రెడీ ఫైనలైజ్‌ అయిన ట్యూన్స్‌ను రికార్డ్ చేస్తున్నారట. నాగార్జున, కీరవాణిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళ కలయికలో కమర్షియల్‌ మూవీస్‌తోపాటు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'ఓం నమో వెంకటేశాయ' వంటి క్లాసిక్ మూవీస్ వచ్చాయి.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 05:40 PM IST

MM Keeravani: కీరవాణి ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా వున్నారు. స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరో వరకు అందరికీ ట్యూన్స్‌ ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ మధ్యకాలంలో ఇన్ని సినిమాలు ఎప్పుడూ చేయలేదు కీరవాణి. ప్రస్తుతం తనకు గతంలో కలిసొచ్చిన స్టార్‌ మూవీలకు ట్యూన్స్‌ ఇచ్చే పనిలో వున్నారు కీరవాణి. ఘోస్ట్‌ ఫ్లాప్‌ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్‌ తీసుకుని ‘నా సామిరంగ’ అనే రగ్డ్‌ అండ్‌ రస్టిక్‌ మూవీ చేస్తున్నాడు నాగార్జున. ఆమధ్య రిలీజ్‌ చేసిన వీడియోలో ఊరమాస్‌ అవతార్‌లో కనిపించాడు మన్మథుడు.

వర్మ నుంచి లారెన్స్‌ వరకు ఎంతోమంది న్యూ టాలెంట్‌ను పరిచయం చేసిన నాగ్.. ఈసారి నా సామిరంగ మూవీతో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నికి డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చాడు. మలయాళ హిట్‌ పోరింజు మరియం జోస్ అనే మూవీ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోందని ఫిలిం వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు. నా సామి రంగ కోసం కీరవాణి ట్యూన్స్‌ ఇచ్చే పనిలో వున్నారు. ఆల్రెడీ ఫైనలైజ్‌ అయిన ట్యూన్స్‌ను రికార్డ్ చేస్తున్నారట. నాగార్జున, కీరవాణిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళ కలయికలో కమర్షియల్‌ మూవీస్‌తోపాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి క్లాసిక్ మూవీస్ వచ్చాయి. నాగ్‌, కీరవాణి కాంబోలో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్ వచ్చాయి.

అల్లరి అల్లుడు.. వారసుడు, ఘరానా బుల్లోడు, ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం హిట్స్‌కు కీరవాణి మ్యూజిక్‌ ప్లస్‌ అయింది. చాలా గ్యాప్ తర్వాత ‘నా సామిరంగ’ అంటూ ఈ హిట్‌ కాంబో కలిసింది. నాగ్‌ కెరీర్‌లో హయ్యెస్ట్‌ గ్రాస్‌ తీసుకొచ్చిన సోగ్గాడే చిన్నినాయన రిలీజైన సంక్రాంతికే నా సామిరంగ మూవీని విడుదల చేస్తున్నారు.