Vishwambhara: 30 ఏళ్ల త‌ర్వాత చిరు-కీరవాణి కాంబో.. సంగీతం ఎలా ఉండబోతుందంటే.

ఎగ్జైటింగ్‌గా మారిన విశ్వంభ‌ర‌కు సంబంధించిన ఓ లేటెస్ట్ బ‌జ్ మెగా ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని మ్యూజిక‌ల్‌గానూ హిట్ చేసేందుకు కీర‌వాణి ఎంతగానో క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌.

  • Written By:
  • Updated On - March 29, 2024 / 01:59 PM IST

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న మూవీ విశ్వంభ‌ర‌. మోస్ట్ ప్రెస్టీజియ‌స్‌గా, విజువ‌ల్ వండ‌ర్‌గా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌తోనే హైఎక్స్‌పెక్టేష‌న్స్‌ను క్రియేట్ చేసింది. ఇందులో చిరు ప‌లు లోకాల‌ను చుట్టి వ‌చ్చే వీరుడిగా న‌టిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీని నెక్ట్స్ లెవెల్ అన్న‌ట్లుగా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందించ‌డం మ‌రింత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

Prabhas : సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా

ఇలా ఎన్నో స‌మ్‌థింగ్ స్పెష‌ల్స్‌తో, ఎవ్రీథింగ్ స్పెష‌ల్‌గా ఎగ్జైటింగ్‌గా మారిన విశ్వంభ‌ర‌కు సంబంధించిన ఓ లేటెస్ట్ బ‌జ్ మెగా ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని మ్యూజిక‌ల్‌గానూ హిట్ చేసేందుకు కీర‌వాణి ఎంతగానో క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో చాలా ఏళ్ళ తరువాత ఈ మూవీ వస్తుండడంతో సాంగ్స్ ఎలా ఉంటాయో వినాలని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీంతో.. కీర‌వాణి సాంగ్స్‌తో పాటు బీజీఎమ్ కూడా అదిరిపోయేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి మెగాస్టార్‌తో కలిసి కీరవాణి గతంలో అనేక సక్సెస్‌ఫుల్ మూవీస్‌కి వర్క్ చేసారు. ఘరానా మొగుడు.. అపద్బాంధవుడు.. ఎస్‌.పి.పరశురామ్‌ వంటి చిత్రాలు హిట్‌ ఆల్బమ్స్ ఇచ్చిన జోడీ అది. వాటిలో పాట‌ల‌న్నీ ఓ క్లాసిక్‌గా నిలాచాయి. నేటికీ ఆ చిత్రాల్లో పాట‌ల్లో మార్మోమ్రోగుతూనే ఉంటాయి. అలాంటి స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్‌లో సినిమా వ‌చ్చి దాదాపు మూడు ద‌శాబ్ధాలు అవుతుంది. ద‌ర్శ‌కుల అభిరుచి మేర‌కు కాంబినేష‌న్స్ మారుతూ వ‌చ్చాయి. అయితే స‌రిగ్గా మ‌ళ్లీ అదే క‌ల‌యిక‌ని యువ ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట క‌లిపాడు.

సోషియా ఫాంట‌సీ చిత్రాల‌కు మెగాస్టార్ స్టైల్‌కు కీర‌వాణి అయితే ది బెస్ట్ ఇవ్వ‌గ‌ల‌రని భావించి వ‌శిష్ట.. కీర‌వాణిని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో చిరు-కీర‌వాణి కాంబోకు 30ఏళ్ల తర్వాత వ‌శిష్ట మ‌ళ్లీ ప్రాణం పోశారు. సో.. నాటి మ్యాజిక్‌ను మ‌ళ్లీ క్రియేట్ చేసి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌ని కీర‌వాణి గ‌ట్టిప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ట‌. ది బెస్ట్ మ్యూజిక్ అందించేలా కీర‌వాణి శ్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. హై రేంజ్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న ‘విశ్వంభర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలిసింది. మ‌రి.. మొత్తానికి పాత చిరును చూడాల‌నుకుంటున్న మెగా ఫ్యాన్స్ క‌ల‌ల‌ను విశ్వంభ‌ర పూర్తి స్థాయిలో నెర‌వేరుస్తుందో లేదో చూడాల్సిందే.