Allu Aravind: అల్లు సపోర్ట్.. హీరోల రెమ్యునరేషన్‌పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!

పాన్ ఇండియా స్టార్లమనే కారణంతో హీరోలు ఇటీవల భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అలాగే డిజిట‌ల్ హ‌క్కుల ఆదాయం పెరిగిందనే సాకుతో కూడా పారితోషికం పెంచేసి నిర్మాత‌ల్ని రిస్కులో పెట్టేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా ఉంది.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 04:17 PM IST

Allu Aravind: పాన్ ఇండియా ట్రెండ్‌తో తెలుగు సినిమా (tollywood) మార్కెట్ మాత్రమే కాదు.. సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం రూ.10, 20 కోట్లు పెడితేనే భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు రూ.100 కోట్లు పెట్టినా తక్కువే అవుతోంది. పాన్ ఇండియా పేరుతో సినిమాల బడ్జెట్ నిర్మాతల అదుపులో లేకుండా పోయింది. హిట్టయితే ఒకే కానీ.. ఒకవేళ సినిమా రిజ‌ల్ట్ తేడా కొడితే మాత్రం అదే నిర్మాత‌లు, బయ్యర్స్ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు.

Varun Tej: ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి.. అమ్మో.. డీల్ అన్ని కోట్లా..

అయితే ఈ ఖర్చు తగ్గించాలంటే హీరోల రెమ్యునరేషన్ (Remuneration) తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. పాన్ ఇండియా స్టార్లమనే కారణంతో హీరోలు ఇటీవల భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అలాగే డిజిట‌ల్ హ‌క్కుల ఆదాయం పెరిగిందనే సాకుతో కూడా పారితోషికం పెంచేసి నిర్మాత‌ల్ని రిస్కులో పెట్టేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా ఉంది. ఇదే విషయాన్ని నిర్మాత అల్లు అర‌వింద్ (Allu Aravind) వద్ద ప్రస్తావిస్తే ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. సినిమా బడ్జెట్ పెరగడానికి కారణం హీరోల పారితోష‌కాలు పెరిగిపోవ‌డమే‌ కారణమనే అభిప్రాయాన్ని అల్లు అరవింద్ కొట్టిపారేశారు. విజువ‌ల్‌గా గొప్పగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నార‌ని.. వారి అంచ‌నాల‌కు త‌గ్గట్లుగా సినిమాను భారీగా తీసే క్రమంలో బ‌డ్జెట్లు పెరుగుతున్నాయ‌ని ఆయ‌న‌ అన్నారు. హీరోల రెమ్యూనరేషన్లు మ‌రీ ఎక్కువ‌గా ఏమీ లేవ‌ని.. బ‌డ్జెట్లో 20-25 శాతం మాత్రమే రెమ్యూన‌రేష‌న్ కింద హీరోలు తీసుకుంటున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Renu Desai: ఐష్‌కు రేణు నో.. పవన్ కళ్యాణ్ కోసం ఐశ్వర్య రాయ్‌ని వదిలేసుకున్న రేణు దేశాయ్

ఉదాహరణకు కేజీఎఫ్ హీరో గురించి అందరికీ పెద్దగా తెలియ‌ద‌ని.. కానీ భారీగా తీయ‌డం వ‌ల్లే ఆ సినిమా చూశార‌ని.. ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో ఉన్నాయ‌ని.. హీరోల పారితోష‌కాలు, బ‌డ్జెట్లు పెర‌గ‌డానికి కార‌ణం కాద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే, అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో స్టేటస్‌ను పుష్పతో అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం బన్నీ దాదాపు రూ.80 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. పుష్పకు వచ్చిన క్రేజ్‌తో పార్ట్ 2ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి టైంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.