Teja sajja : పాన్ ఇండియా హీరోతో మూవీ ఫిక్స్‌..!

టాలీవుడ్‌లో బాలనటుడిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా (Teja Sajja).. అవన్నీ మంచి హిట్లు సాధించాయి కూడా.. ఆ తర్వాత నందిని రెడ్డి ‘ఓ బేబీ’ (O Baby) సినిమాతో యువకుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తేజా రోల్‌కి మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత హీరోగా ‘జాంబి రెడ్డి’ (Zombie Reddy) చిత్రంతో తేజా సజ్జా హీరోగా అడుగుపెట్టాడు.

 

 

 

టాలీవుడ్‌లో బాలనటుడిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా (Teja Sajja).. అవన్నీ మంచి హిట్లు సాధించాయి కూడా.. ఆ తర్వాత నందిని రెడ్డి ‘ఓ బేబీ’ (O Baby) సినిమాతో యువకుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తేజా రోల్‌కి మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత హీరోగా ‘జాంబి రెడ్డి’ (Zombie Reddy) చిత్రంతో తేజా సజ్జా హీరోగా అడుగుపెట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోగా మంచి అవకాశాలు అందుకున్నాడు. ‘ఇష్క్, అద్భుతం’ చిత్రాలు అంతగా మ్యాజిక్ చేయనప్పటికీ.. అవకాశాలు మాత్రం ఆగడం లేదు.. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి సూపర్ హీరోగా ‘హనుమాన్’ (Hanuman) మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.. అయితే.. త్వరలో తేజ సజ్జ నందిని రెడ్డితో ఓ మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు ఫిలిం వర్గాల్లో వైరల్‌ అవుతోందతి.

డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దగ్గర సహాయక దర్శకురాలిగా పనిచేసిన నందిని రెడ్డి మొదట నానితో అలా మొదలైంది అనే సినిమా చేసింది.. మొదటి అడుగులోనే మంచి సక్సెస్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత ఎందుకనో అంతగా సక్సెస్‌ను అందుకోలేకపోయింది. మంత సిద్ధార్థ్ తో చేసిన జబర్దస్త్ మూవీ విషయంలో కంటెంట్‌ ఆరోపణలూ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ మధ్యన సమంతతో చేసిన ఓ బేబీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత కొంత గ్యాస్ తీసుకుని చేసిన అన్నీ మంచి శకునములే సినిమా మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఈ టైమ్‌లో మరోకథ రెడీ చేసుకొని సిద్ధు జొన్నలగడ్డను కలిస్తే నో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇదే లైన్‌ను తేజ సజ్జాకు వినిపిస్తే.. తేజ సానుకూలంగా స్పందిచినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

హనుమాన్ సినిమాతో ఇటీవల మంచి సక్సెస్ అందుకున్న తేజ సజ్జా నందిని రెడ్డి చెప్పిన కథకు ఓకే అన్నట్లుగా లేటెస్ట్ బజ్.. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమాలో చేసిన క్యారెక్టర్ తేజకు మంచి పేరు తీసుకు వచ్చింది. బహుశా ఆ కృతజ్ఞత వల్లనో ఏమో కానీ మొత్తానికి ఈ దర్శకురాలికి మాత్రం అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తేజ లైనప్ కూడా గట్టిగానే ఉంది. అటు.. నందిని రెడ్డికూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈ కాంబో హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా అప్డేట్ రాబోతోందంటున్నారు.