కానీ కరోనా పాండమిక్ తరువాత పరిస్థితులు మారిపోయాయి. థియేటర్స్ దగ్గర ఒకప్పుడు ఉన్నంత సందడి ఇప్పుడు కనిపించడంలేదు. థియేటర్స్‌కు వచ్చేందుకు ఆడియన్స్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడంలేదు. ఇక ఓటీటీలు వచ్చాక.. థియేటర్స్‌కు వచ్చేవాళ్ల కౌంట్ బాగా తగ్గిపోయింది. ఫస్ట్ డే మంచి టాక్ వస్తే తప్ప ఆడియన్స్ సినిమాకు రావడంలేదు. దీంతో మొదటి రెండు రోజులు ప్రతీ సినిమాకు కీలకంగా మారిపోతున్నాయి. కథ ఎలా ఉన్నా.. ఈ రెండు రోజులు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు మేకర్స్.
రీసెంట్‌గా వచ్చిన చాలా సినిమాలకు ఫస్ట్ డే టికెట్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ప్రటించారు. అడవి శేష్ హీరోగా వచ్చిన ఎవరు సినిమాను.. యదాయదాహి పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెట్టారు నిర్మాతలు. గతంలో కూడా చాలా సినిమాలకు ఇలా ఆఫర్స్ ప్రకటించారు. నాగచైతన్య హీరోగా వచ్చి థాంక్యూ సినిమాకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించారు. ఇక సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ అనే సినిమాకు లేడీస్ కోసం ఫ్రీగా స్పెషల్ షోలు వేశారు.
రీసెంట్‌గా వచ్చిన మేము ఫేమస్ సినిమాకు కూడా ప్రీమియర్ షో టికెట్ కేవలం 99 మాత్రమే పెట్టారు. ఇవన్నీ బాగా వర్కౌట్ అవడంతో ఇదే ఫార్ములాను పెద్ద సినిమాలు కూడా ఫాలో అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా భారీ అంచనాలతో వస్తున్న ఆదిపురుష్ సినిమాకు కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. జస్ట్ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు.. ఆడియన్స్ ఆటోమేటిక్‌గా థియేటర్స్‌కు వస్తారు అనేది మేకర్స్ లాజిక్. వాళ్ల లాజిక్ ప్రకారం పాటిస్తున్న ఈ స్ట్రాటజీ ప్రస్తుతం బాగానే పని చేస్తోంది. ప్రస్తుతానికి ఆఫర్లు ఇలా ఉంటే ఫ్యూచర్‌లో ఇంకా ఎలాంటి ఆఫర్స్ తీసుకువస్తారో చూడాలి.