BRO: థియేటర్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బ్రో మూవీ విడుదలై, డిజాస్టరైంది. ఏరేంజ్‌లో అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగేంతగా. కట్ చేస్తే ఇప్పుడు అదేమూవీ హిట్టైంది. అది కూడా ఓటీటీలో. అదే విచిత్రం. కొన్ని సార్లు థియేటర్లలో బొక్కబోర్లా పడ్డ మూవీలు, ఓటీటీల్లో దుమ్ముదులపటం విచిత్రంగా అనిపిస్తుంది. కాని, అదే నిజం.
బ్రో మూవీ ఒక్కటే కాదు.. మరో డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ కూడా విచిత్రంగా ఓటీటీలో దూసుకెళుతోంది. టిక్కెట్ కొని థియేటర్స్‌కి వెళ్లలేం కాని, ఇంట్లోనే ఫ్రీగా అంటే మాత్రం ఓకే అనే బ్యాచ్ చాలా మందే ఉన్నారు. వాళ్ల వాదనా కరెక్టే..! వందలు, వేలు పోసి థియేటర్ కెళ్లి చూస్తే ఆసినిమా బాలేకపోతే డబ్బు, టైం వేస్ట్. అదే ఫ్రీగా ఓటీటీలో వస్తే మాత్రం ఇంటిల్లిపాది చూసేయొచ్చు. అది పూర్తిగా ఫ్రీ కాకున్నా డాటా రిచార్జ్ చేయాలి. ఓటీటీ రెంట్ కట్టాలి. అయినా థియేటర్లో ఒక సినిమాకయ్యే ఖర్చుతో ఏడాది పొడవునా ఓటీటీ రెంట్ కట్టేయొచ్చు కాబట్టి అదేమంత ఖర్చు కాదు.
తమిళ్ మూవీ మహావీరుడు, లోబడ్జెట్ ప్రయోగాలు పరేషాన్, విమానం, అంటే సుందరానికి ఇలా చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాపై ఓటీటీలో హిట్టయ్యాయి. ఒకప్పుడు మహేశ్ బాబు మూవీలైన అతడు, ఖలేజా థియేటర్స్‌లో అంతగా ఆడకున్నా టీవీల్లో మాత్రం ఇప్పటికీ రేటింగ్స్ ని బీపీ పెంచినట్టు పెంచేస్తాయి. సో టీవీ లానే ఇప్పుడు ఓటీటీ కూడా ఫ్లాప్ మూవీలను హిట్టు చేసే ఫ్లాట్ ఫాంగా మారినట్టుంది.