ఈ మధ్య కాలంలో మాస్ మహారాజ రవితేజా వరుసగా సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా హిట్ కొట్టడం లేదు అనే చెప్పాలి. సినిమాపై భారీ అంచనాలు ఉంటున్నా… రీమేక్ సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమా చేయగా రాడ్ టాక్ వచ్చింది. అసలు సినిమా పెట్టుబడి కూడా రాకపోవడంతో షాక్ అయ్యాడు నిర్మాత. ఈ నేపధ్యంలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు మిస్టర్ బచ్చన్ నిర్మాత విశ్వ ప్రసాద్. అసలు తన కెరీర్ లోనే వరస్ట్ డెసిషన్ ఆ సినిమా అన్నారు.
మిస్టర్ బచ్చన్ తన జీవితంలో తీసుకున్న వరస్ట్ డెసిషన్ అని చెప్పిన ఆయన… 80ల నాటి హిందీ పాటలు నాకు నచ్చి సినిమా ఆడేస్తుందనున్నానని చెప్పుకొచ్చాడు. అదొక తప్పు అయితే, ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, కొన్ని ఎపిసోడ్స్ ను చాలా ఫాస్ట్ గా తీసేశాం అని తెలిపిన ఆయన… సినిమాలో 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్ గా తీసుంటే హిట్టయ్యేదన్నారు విశ్వ ప్రసాద్. కీలకమైన ఆ ఎపిసోడ్స్ మేం ఫాస్ట్ గా తీశామని… అలా ఒరిజినల్ మూవీ… రైడ్ సీన్స్ ను ఎగ్జిక్యూట్ చేయడంతో సినిమా మిస్ ఫైర్ అయిందని గుర్తు చేసుకున్నాడు.
ప్రాజెక్టులో ఆఖరి నిమిషంలో అడుగుపెట్టడం కూడా తను చేసిన తప్పని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేయడంపై డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్తేమీ కాదని… అలానే సోషల్ మీడియా మాత్రమే నా జీవితం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు… నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా..పిడుగు వచ్చినా ఇలానే ఉంటా అంటూ గబ్బర్ సింగ్ సినిమా డైలాగ్ చెప్పాడు. అది తన క్యారెక్టర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలకు వచ్చిన స్పందనలు నన్ను నిరాశపరిచాయని… కానీ, ఆ దర్శకుల మీద లేని అటాక్ నాపై జరిగిందని వాపోయాడు హరీష్ శంకర్. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని చెప్పిన ఆయన… ఇందులోని ఒక డ్యాన్స్ మూమెంట్‌ను ప్రధానంగా తీసుకుని విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కానీ, ఇందులో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదని వాపోయాడు హరీష్. కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క అని రాశానన్న హరీష్… దాన్ని పక్కన పెట్టేశారు. ఆ డైలాగు అమ్మాయిలకు చాలా నచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పారని గుర్తు చేసుకున్నాడు. అలాగే హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యేవరకు నిన్ను కదిలించను’ అంటాడని… అమ్మాయిలు ఏ విషయంలోనైనా ‘నో’ చెబితే వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగు రాశానని తెలిపాడు. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు హరీష్.