టాలీవుడ్ క్రియేటివ్ హీరో అడవి శేష్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. కొన్నిసార్లు తన సినిమాలకు తానే కథలు రాసుకుంటూ అలాగే సినిమాల్లో తన రోల్స్ ని తానే డిజైన్ చేసుకుంటూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ హీరోకి హీరోయిన్ల సమస్య ఉంది అనే టాక్ వినబడింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న అడవి శేష్… హీరోయిన్లు దొరకక ఇబ్బందులు పడుతున్నాడు.
తన సినిమాల్లో ఫైనల్ అయిన హీరోయిన్లు ఏదో ఒక కారణంతో బయటకు వెళ్లిపోవడంతో ఈ మధ్య కాస్త అప్సెట్ అయినట్లు కనిపించాడు. ప్రస్తుతం అడవి శేషు హీరోగా డెకాయిట్ అనే సినిమా తెరకెక్కుతోంది. నేడు అడవి శేషు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేశారు మేకర్స్. మొదట ఈ సినిమాకు శృతిహాసన్ ను సెలెక్ట్ చేయగా ఆమె తప్పుకుంది. ఇందులో కీలకపాత్రలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
దీనికి సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా అడవి శేషు రిలీజ్ చేశాడు. ప్రేమించావు కానీ మోసం చేసావు… విడిచిపెట్టను తేలాల్సిందే అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి స్పందించిన మృణాల్ ఠాకూర్… వదిలేసాను కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. అలాగే అడవి శేషు ఈ సినిమాతో పాటుగా గూడచారి 2 అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. గూడచారి పార్ట్ 2 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు మేకర్స్. ఈ సినిమాలో చాలా సన్నివేశాలను… ఫ్రాన్స్, స్విజర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ప్లాన్ చేశారు.
ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 100 కోట్లకు పైగానే ఉంది. ఈ చిత్రంలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అందుకోసం ఆయనకు భారీగానే రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు మేకర్స్. ఇక గూడచారి 2 సినిమాలో కూడా హీరోయిన్ సమస్య ఉంది అనే టాపిక్ వస్తుంది. దీనితో ఆ సినిమాలో కూడా మీనాక్షి చౌదరి ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. హిట్ టు 2 సినిమాలో మీనాక్షి చౌదరి నటించింది. ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్న ఆమెను అడవి శేషు తన తర్వాతి సినిమాలో కూడా తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్. ఇక 2024 లో అడవి శేషు నుంచి సినిమా ఉంటుందని అందరూ ఎదురు చూశారు. కానీ 2024 లో ఏ సినిమా లేకుండానే ముగించేసాడు అడవి శేషు. వచ్చే ఏడాది మార్చి నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.