Mrunal Thakur: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటలీ షూటింగ్ తర్వాత హైద్రబాద్‌లో పాట షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే ది రాజా సాబ్ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. అయితే జూన్‌లో హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా సెట్స్ పైకెళ్లబోతోంది. కథ సిద్దమైంది. విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్‌తో ఈ సారి జోడీ కట్టబోయేది సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్.
Surya Kiran: కల్యాణి ఎప్పటికీ నా భార్యే.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్యకిరణ్ చివరి మాటలు..
డైరెక్టర్ హనూ రాఘవపూడి మృణాల్‌కే ఓటేశాడట. ప్రభాస్ కూడా 180 రోజుల కాల్ షీట్స్ ఇవ్వటంతో పాటు మృణాల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక్కడ అసలు విషయం ఏంటేంటే, ప్రభాస్ సాహో మూవీ షూటింగ్ టైంలో ఓ స్పెషల్ రోల్ కోసం అప్పట్లో మృణాల్‌ని ముంబై సెట్‌కి పిలిచారట. కాని తను అప్పుడు ఇంకా ఫేమస్ కాదు. టీవీ సీరియల్స్ చేస్తూనే సూపర్ 30 మూవీ చేసింది. దీంతో సాహో హీరోయిన్ శ్రద్ధా దాస్.. ఈ హీరోయిన్ ని గుర్తుపట్టినా తెలియనట్టే నటించిందట. అంతేకాదు త్రిబుల్ ఆర్ టైంలో రాజమౌళిని కలవటానికి మృణాల్ సెట్‌లోకొస్తే, ఆలియా కూడా ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు చూసిందట.
అయితే వాళ్లని పలకరించిన మృణాల్.. సీతారామం, హాయ్నాన్న హిట్స్‌తో సౌత్‌లో, సూపర్ 30తో నార్త్‌లో హిట్ మెట్టెక్కింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియ సూపర్ హీరో ప్రభాస్‌తోనే జోడి కడుతోంది. ప్రభాస్ సినిమాతో బాలీవుడ్ నెపో కిడ్స్‌కి షాక్ ఇచ్చే పనిలో పడింది.