Mrunal Thakur: మహేశ్ బాబునే మాయ చేస్తున్న సీత.. బుట్టలో పడినట్టే..!

సీతారామం హిట్ అయినప్పుడు తనకు న్యాచురల్ స్టార్ నాని నటన ఎంతో ఇష్టం అంది. తనతో నటించాలనుంది అనేసింది. అలా అన్నదో.. లేదో.. వెంటనే నాని చేస్తున్న హాయ్ నాన్న మూవీలో ఛాన్స్ పట్టేసింది.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 05:30 PM IST

Mrunal Thakur: సూపర్ స్టార్ మహేశ్ బాబుని బుట్టలో పడేసేందుకు సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ చాలా కష్టపడుతోంది. తను ఎంత కష్టపడ్డా మహేశ్‌తో జోడీకట్టే ఛాన్స్ ఇప్పట్లో లేదంటున్నారు. దానికో లెక్కుంది. కాని ఈ లేడీ నాలిక మీద చాలా పెద్ద మచ్చున్నట్లుంది.

సీతారామం హిట్ అయినప్పుడు తనకు న్యాచురల్ స్టార్ నాని నటన ఎంతో ఇష్టం అంది. తనతో నటించాలనుంది అనేసింది. అలా అన్నదో.. లేదో.. వెంటనే నాని చేస్తున్న హాయ్ నాన్న మూవీలో ఛాన్స్ పట్టేసింది. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ యాంగ్రి యంగ్ మ్యాన్ అనేసింది. లక్కీగా పరశురామ్ మేకింగ్‌లో విజయ్ తో జోడీకట్టే ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా చేయాలనుందని, అది తన డ్రీమ్ అని అంటోంది మృణాల్ ఠాకూర్. తనేమంటే అది జరిగిపోతోంది. కాబట్టి ఇది కూడా జరుగుతుందా అంటే, త్రివిక్రమ్ మూవీలో పూజా ప్లేస్ లో శ్రీలీల, తన ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చారు. కాబట్టి ఈ మూవీలో ఛాన్స్ కష్టమే.

ఇక ఏమైనా ట్రై చేయాలంటే రాజమౌళిలో మహేశ్ చేసే సినిమాలోనే ట్రై చేయాలి. కాని అందులో హాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకుంటారనే టాక్ ఉంది. అదే నిజమైతే మృణాల్ నాలుక మీద ఎన్ని మంచలున్నా నో యూజ్. అలా కాక బాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకునే అవకాశం ఉందంటే, దీపికాతో మృణాల్ పోటీ పడాల్సి వస్తుంది.