ఓజీ మాస్ అప్డేట్, 80 పర్సంట్ ఫినిష్, పవన్ ఎయిమ్ టూ బాలీవుడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో పిచ్చి ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ కాదు బొమ్మ పడితే చాలు... పవన్ తన మేనరిజం చూపిస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నా ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుద్దో అర్ధం కాని పరిస్థితి.

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 03:42 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో పిచ్చి ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ కాదు బొమ్మ పడితే చాలు… పవన్ తన మేనరిజం చూపిస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నా ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుద్దో అర్ధం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ విషయంలో నిర్మాతలు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసే పరిస్థితి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఎత్తు అయితే… ఓజీ మరొకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

సినిమాను గ్రాండ్ గా తీయడంలో సుజిత్ మార్క్ క్లియర్ గా కనపడుతోంది. సాహో సినిమా ఫ్లాప్ అయినా టేకింగ్ మాత్రం పీక్స్ లో ఉంటుంది అంటారు ఫ్యాన్స్. ఇప్పుడు పవన్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. టైటిల్ తోనే పవన్ ను ఎలా చూపిస్తా అనేది క్లారిటీ ఇచ్చాడు సుజిత్. ఈ సినిమా షూట్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయింది. వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని నిర్మాత కూడా ప్రకటించాడు. ఇక పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను ఫినిష్ చేస్తున్నాడు డైరెక్టర్. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఓ యాక్షన్ సీన్ కూడా షూట్ చేస్తారు.

పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటుగా ఓజీని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇదే టైం లో సినిమా మ్యూజిక్ పై కూడా ఫ్యాన్స్ లో హోప్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు సినిమాల్లో మ్యూజిక్ బాగా డామినేట్ చేస్తోంది. ఓ సీన్ ఎలివేట్ కావాలి అంటే కచ్చితంగా మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తోంది. తమిళంలో అయితే ఈ లాజిక్ తోనే సీనియర్ హీరోలు హిట్ లు కొడుతున్నారు. ఈ తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ విషయం బయటపెట్టాడు. బర్త్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన తమన్… ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చాడు.

‘ఓజీ’ గురించి నేను ఏం మాట్లాడినా డిప్యూటీ సీఎం గారికి చేరుతుందన్న తమన్… అందుకే జాగ్రత్తగా మాట్లాడుతున్నానని చెప్పి సినిమా గురించి పలు విషయాలు బయటపెట్టాడు. సెప్టెంబర్ 2న పాట, పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్నారని… కానీ ఆయన వరదల ప్రభావంతో అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయొద్దని అన్నారన్నారు. జనవరి నుంచి అప్డేట్లు ఇస్తామని తెలిపారు. దాదాపు 80 శాతం షూటింగ్ అయిపోయిందని ఇంత వరకు ఇండియాలో రానటువంటి ఓపెనింగ్స్ ఓజీకి వస్తాయని ధీమా వ్యక్తం చేసాడు. ఆయనని మీట్ అయ్యేందుకే కష్టపడుతున్నామన్నాడు. ఇక అకీరాతో పియానో వర్క్ కూడా ఈ సినిమా కోసం చేస్తున్నాం అని తెలిపాడు.