Rc 16 : ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్..

ట్రిపుల్ ఆర్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌ చరణ్‌ (Ram Charan) అప్ కమింగ్ మూవీస్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ (game changer) మూవీ చేస్తున్నాడు చెర్రీ.. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

 

 

 

ట్రిపుల్ ఆర్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌ చరణ్‌ (Ram Charan) అప్ కమింగ్ మూవీస్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ (game changer) మూవీ చేస్తున్నాడు చెర్రీ.. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా (Pan India) మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రెస్టీజియస్ మూవీలో నటించనున్నాడు. ఇప్పుడు రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

RC16గా పిలుస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.. చరణ్ కూడా ఈ సినిమా కథ గురించి గొప్పగా మాట్లాడడంతో అభిమానుల్లో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి అదిరిపోయే కాస్టింగ్ క్రూని సెలెక్ట్ చేస్తుండడంతో ఆ అంచనాలు మరింత హీటెక్కుతున్నాయి.

RC16 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏ ఆర్ రెహమాన్ పని చేస్తుండడం మరిన్ని అంచనాలు పెంచేసాయి. కొద్దిరోజులుగా ఈ మూవీకి సంబంధించి ఏ ఆర్ రహమాన్ అద్వర్యంలో దర్శకుడు బుచ్చి బాబు మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారట. ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న ఈ సిట్టింగ్స్ లో కేవలం మూవీ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మ‌రింత వేగంగా జ‌రుగుతున్నాయి. న‌టీన‌టులు.. సాంకేతిక నిపుణులు ఎంపిక వేగంగా జ‌రుగుతోంది. ఇప్పకే చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీక‌పూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అలాగే చెర్రీకి విలన్‌గా విజ‌య్ సేతుప‌తిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా కొన్ని కీల‌క పాత్రల‌కు పేరున్న న‌టుల్ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం..