Naa Saami Ranga: సరిలేరు నీకెవ్వరు రికార్డు బ్రేక్ చేసిన నా సామిరంగ

ఆమధ్య సరిలేరు నీకెవ్వరు మూవీని 5 నెలల్లో పూర్తి చేశాడు అనిల్ రావిపుడి. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో నెల తీసుకున్నాడు. కానీ, నా సామి రంగ అలాకాదు. షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఒకేసారి జరిగింది.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 07:17 PM IST

Naa Saami Ranga: కింగ్ నాగార్జున నా సామి రంగ ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి సందడిలో ఈ మాస్ మన్మధుడి మూవీ ఉండబోతోంది. కేవలం సెప్టెంబర్‌లో మొదలై, జనవరిలో సినిమా రిలీజ్ కాబోతోందంటే నిజగా ఇది వండరే. ఆమధ్య సరిలేరు నీకెవ్వరు మూవీని 5 నెలల్లో పూర్తి చేశాడు అనిల్ రావిపుడి. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో నెల తీసుకున్నాడు. కానీ, నా సామి రంగ అలాకాదు. షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఒకేసారి జరిగింది.

PRABHAS: సలార్ 2 ఎప్పుడు మొదలౌతుందో తేలిపోయిందా..?

వచ్చే వారం సినిమా రిలీజ్ కాబోతోంది. ఇలా చూస్తే సరిలేరు నీకెవ్వరు రికార్డుని నా సామిరంగ మూవీ బ్రేక్ చేసినట్టే అనుకోవాల్సి వస్తోంది. ఇక నా సామిరంగ టీం ఇంత వేగంగా సంక్రాంతికే ఈమూవీని రిలీజ్ చేయటానికి బలమైన కారణం.. సెంటిమెంటే. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగిల్ లాంటి మూవీలు పోటీకొస్తున్నా, కోలీవుడ్ మూవీలు కూడా పోటీకి దిగుతున్నా, థియేటర్ల పంపకాల ఇష్యూస్ ఉన్నా, నాసామిరంగని పొంగల్‌కే ఎందుకు రిలీజ్ చేయడానికి నాగ్‌కు ఉన్న సంక్రాంతి సెంటిమెంటే కారణం.

సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు.. ఇలా సంక్రాంతికి వచ్చిన నాగ్ మూవీలు హిట్టయ్యాయి. దీనికి తోడు కొత్తవాళ్లకు నాగ్ ఛాన్స్ ఇచ్చిన సినిమాల్లో 90 శాతం అన్నీ హిట్లే. ఈ రెండు కారణాలే పొంగల్ పోరులో ఎంతమంది పోటీకొచ్చినా నా సామిరంగని రిలీజ్ చేస్తున్నారు.