Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

కల్కి ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే ఒక డిఫరెంట్ ఫిల్మ్. హాలీవుడ్ మేకర్స్ నిర్మించే ఫ్యూచర్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూపించినట్టే కల్కిలో కూడా ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతున్నాయో చూపించబోతున్నాం.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 12:48 PM IST

Kalki 2898 AD: సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూసారో ఇప్పుడు ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి కోసం అంతకు మించి ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. కల్కి కేవలం ఒక సినిమానే కాదు.. భారతీయ సినిమాని ప్రపంచ సినిమా ముందు గర్వంగా నిలబడిపోయేలా చేసే సినిమాగా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

Nagababu vs Rgv : వర్మ గారు మీరు బతికే ఉన్నారా.. ఆర్జీవీని ఆడుకున్న నాగబాబు..

నాగ్ అశ్విన్ తాజాగా మహారాష్ట్రలోని బాంబే ఐఐటీలో జరిగిన టెక్ ఫెస్ట్ 23లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కల్కి 2898 AD ప్రత్యేక కంటెంట్‌ను ప్రదర్శించారు. ఆ తర్వాత మూవీ గురించి మాట్లాడుతూ.. “కల్కి ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే ఒక డిఫరెంట్ ఫిల్మ్. హాలీవుడ్ మేకర్స్ నిర్మించే ఫ్యూచర్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూపించినట్టే కల్కిలో కూడా ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతున్నాయో చూపించబోతున్నాం. దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తూ ప్రతి అంశంపై లోతుగా ఆలోచించి స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి కల్కి కోసం ఒక న్యూ వరల్డ్‌ని బిల్డ్ చేశామని చెప్పాడు. పైగా కల్కి టీజర్ రిలీజ్ అయినప్పుడు సినిమాలో కనపడిన ఆయుధాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు.ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్‌లో ఎలా మార్పు చెందే అవకాశం వుందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్.. ఇలా టీం అంతా కలిసి మేధోమధనం చేసి మరీ ప్రతిది డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం కూడా ఉంది” అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రభాస్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె క్యారెక్టర్స్ వాళ్ల అభిమానులంతా ఆనందపడే రీతిలో ఉంటాయని, ఇంతకు ముందెప్పుడు అలాంటి పాత్రల్లో వారు కనిపించలేదని కూడా ఆయన చెప్పాడు. అలాగే కొంత మంది కల్కికి 2898 AD అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి అని అడిగితే దీనికి వెనుక ఒక లాజిక్ వుంది. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో అందుకు కారణాన్నిచెప్తానని, అలాగే 93రోజుల తర్వాత ట్రైలర్ రిలీజ్ ఉంటుందని చెప్పాడు.