Naga Chaitanya: చైతూ, శోభితా డేటింగ్‌ ! ఇలా దొరికిపోయారేంటి..

చైతూ, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారని.. అక్కడ కనిపించారని, ఇక్కడ కనిపించారని కొన్నిరోజులుగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి దొరికిపోయారీు. ఇద్దరు కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లినట్లు నెటిజన్లు పట్టేశారు.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 06:37 PM IST

Naga Chaitanya: సమంతను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత.. నాగచైతన్య మీద రకరాల రూమర్స్ స్టార్ట్ అయ్యాయ్. ఓ కుర్ర హీరోయిన్‌తో ఫ్రెష్‌గా ప్రేమలో పడ్డాడంటూ చాలారోజులుగా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. చైతూ, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారని.. అక్కడ కనిపించారని, ఇక్కడ కనిపించారని కొన్నిరోజులుగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి దొరికిపోయారు.

RENU DESAI: మాధవీలతకు రేణు దేశాయ్ సపోర్ట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

ఇద్దరు కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లినట్లు నెటిజన్లు పట్టేశారు. గతేడాది నాగచైతన్య ఓ రెస్టారెంట్‌లో ఫొటో దిగారు. ఆ ఫొటో వెనకాల శోభితా దూళిపాళ్ల కనిపించడంతో.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ గాసిప్స్ మొదలయ్యాయ్. అక్కడితో ఆగారా అంటే.. శోభిత వల్లే.. సమంత, చైతూ దూరం అయ్యారని కాస్త మసాలా అద్దిన బ్యాచ్ కూడా ఉందనుకోండి. ఐతే ఈ రూమర్లపై చైతూ గతంలోనే రియాక్ట్ అయ్యాడు. తనకు శోభితతో ఎలాంటి ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఐతే ఇప్పుడు మరోసారి వీరికి సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియాలో చైతూ కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశాడు లేటెస్ట్‌గా ! ఎక్కడికో హాలీ డే ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేశాడు. శోభితా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

చైతూ షేర్ చేసిన ఫొటోలు, శోభితా పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌ సేమ్ ఉండడంతో.. ఇద్దరు కలిసే ట్రిప్‌కు వెళ్లారంటూ గుసగుసలు మొదలయ్యాయ్. ఈ ఫొటోలను షేర్ చేస్తున్న నెటిజన్లు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై చైతూ, శోభితా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.