Naga Chaitanya: ఓ ఇంటి వాడైన నాగ చైతన్య..సమంత జ్ఞాపకాలని వదిలేశాడు

నాగచైతన్య ఓ ఇంటివాడయ్యాడు. ఏంటీ మళ్లీ పెళ్లి చేసేసుకున్నాడా? అని ఆలోచింవద్దు. ఓ ఇల్లు కట్టించుకుని..గృహప్రవేశం చేశాడు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు కదా.. నెక్ట్స్‌ పెళ్లే మిగిలిందా?

  • Written By:
  • Updated On - March 27, 2023 / 02:18 PM IST

నాగచైతన్య, సమంత విడిపోయాక.. అప్పటివరకు వున్న ఈ ఇద్దరూ కలిసున్న ఇంటి నుంచి చైతు బైటకొచ్చేశాడు. విడిపోతున్నామని చెప్పి ఏడాదిన్నర అవుతోంది. ఈలోగా నాగార్జున వుంటున్న ఇంటికి దగ్గరలోనే స్థలం తీసుకుని.. తన టేస్ట్‌కు తగ్గట్టు ఇల్లు కట్టించుకున్నాడు. ఇలా ఓ ఇంటివాడయ్యాడు చైతు.

చైతు ఓ ఇంటివాడైన సంగతిని ప్రేమమ్‌.. కార్తికేయ దర్శకుడు చందు మొండేటి బైటపెట్టాడు. రీసెంట్‌గా చైతు కొత్త ఇంటికి వెళ్లిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఉగాది రోజు నేను మొదటి అతిథిని అంటూ రాసుకొచ్చాడు దర్శకుడు. చైతు, చందు కాంబోలో ప్రేమమ్‌, సవ్యసాచి రూపొందాయి.

నాగచైతన్య ఓ ఇంటివాడయ్యాన్న వార్తతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. ఇక పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సమంతతో బ్రేకప్‌ తర్వాత చైతు గూఢచారి ఫేం శోభిత ధూళిపాళ్లకు దగ్గరయ్యాడని.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. శోభిత ఖండించినా.. రూమర్స్‌ ఆగడం లేదు. మరి చైతు కొత్త ఇంటిలోకి వచ్చేది ఎవరో చూడాలంటున్నాడు నెటిజన్లు.