సినిమా పరిశ్రమ మొత్తం ఒకటి రెండు కుటుంబాల చేతిలో ఉందనే కామెంట్స్ మనం వింటూనే ఉంటాం. సినిమా పరిశ్రమలో కొన్ని కుటుంబాలు పెత్తనం చెలాయిస్తూ కొత్త వారికి ఏ మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదనే కామెంట్స్ మనం వింటూనే ఉంటాం. మెగా కుటుంబంపై ఈ ఆరోపణలు చాలానే వచ్చిన సంగతి తెలిసిందే. కొందరి చావుకి కూడా మెగా కుటుంబం కారణం అంటూ కొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. దీని వెనుక వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఏది జరిగినా సరే మెగా కుటుంబం అంటూ విమర్శలు చేసారు.
తమకు భజన చేస్తే మాత్రమే సిని పరిశ్రమలో ఉండటం సాధ్యం అని లేకపోతే అసలు ఉండనివ్వరు అంటూ కొందరు బహిరంగంగానే మాట్లాడారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎవ్వరైనా ఇక్కడ రాణించొచ్చని స్పష్టం చేసారు. ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది అనే వెదవలకి చెప్తున్నా.. అడివి శేష్ లాంటి వారిని ఎవరు ఆపారు అని ఆయన ప్రశ్నించారు. టాలెంట్ ఉంటే ఎవ్వరైనా రాణించొచ్చు అన్నారు నాగబాబు.
తమకు అలాంటి ఫీలింగ్ అసలు లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమా పరిశ్రమ తమ అబ్బ సొత్తు కాదని అలాగే అక్కినేని, నందమూరి ఫ్యామిలీలది కాదని అన్నారు. ఎందరో యువకులు ఊర్ల నుంచి వచ్చి స్టార్ లు గా ఎదిగారని అన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కచ్చితంగా మంచి పేరు వస్తుందని స్పష్టం చేసారు. నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.