Kalki : పరశురాముడి పాత్రలో నాగార్జున…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం సరి కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడు నాగ్ అశ్విన్..ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారన్న టాక్‌ మూవీపై పాజటివ్ బజ్ క్రియేట్ చేస్తుండగా.. లేటెస్ట్ దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

కల్కి మూవీపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ మూవీలో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పరశురాముడి పాత్రలో కింగ్ నాగార్జున కనిపిస్తాడంటూ టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాల్లో భాగంగా పరశురాముడి పాత్ర వస్తుందట.. మరి ఈ పాత్రకు ఎన్టీఆర్ ను తీసుకోవాలా..? లేక నాగార్జున అయితే బాగుంటుందా అని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి.. దీనిపై చిత్ర యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

కాగా.. కల్కి మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.. ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని చిత్రయూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మే 13న ఎన్నికలు జరగనుండటంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. మే 7న కూడా పన్నెండు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ టైంలో సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అని సినిమాను వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. రీసెంట్‌గాఇ కల్కి రిలీజ్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. “కల్కి 2898 AD” సినిమాను మే 30న విడుదల చేయనున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీని పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్. ఉగాది రోజు కల్కి సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు.