శుభలేఖ ఇద్దామా వద్దా…? నాగార్జునకు కొత్త సమస్య

మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు లేకపోయినా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడకపోయినా న్యూస్ ను ఫాలో అయ్యే వాళ్లకు దగ్గర అవుతూనే ఉంటారు. ఏదోక రూమర్ గాని గాసిప్ గాని పక్కా న్యూస్ గాని అక్కినేని ఫ్యామిలీ మీద రెగ్యులర్ గా షికారు చేస్తూనే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 01:39 PM IST

మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు లేకపోయినా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడకపోయినా న్యూస్ ను ఫాలో అయ్యే వాళ్లకు దగ్గర అవుతూనే ఉంటారు. ఏదోక రూమర్ గాని గాసిప్ గాని పక్కా న్యూస్ గాని అక్కినేని ఫ్యామిలీ మీద రెగ్యులర్ గా షికారు చేస్తూనే ఉంటుంది. వంద కోట్ల సినిమా లేకపోయినా అక్కినేని హీరోలు సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫేమస్. ముఖ్యంగా సమంతా వ్యవహారంతో ఫ్యామిలీ మొత్తం జనాలకు బాగా దగ్గరైంది అనే చెప్పాలి.

సమంతా డైవర్స్ ఇచ్చిన తర్వాత సినిమాలపై ఫోకస్ చేయడం, బాలీవుడ్ లో బిజీ కావడం… ఆ తర్వాత నాగ చైతన్య శోభితకు దగ్గరయ్యాడనే రూమర్స్… అంతకు ముందే నాగ చైతన్యకు శోభితకు ఏదో ఉంది అందుకే సమంతా దూరమైంది అనే రూమర్స్ ఏదోక రూపంలో వైరల్ అయ్యేవి. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ సహా కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం పెద్ద దుమారమే అయింది. ఇప్పుడు వంద కోట్ల పరువు నష్టం పేరుతో కోర్ట్ లో నడుస్తోంది. కేసు నిలబడినా బడకపోయినా… అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఫేమస్.

ఇక ఇప్పుడు నాగ చైతన్య, శోభిత పెళ్లి వ్యవహారం కూడా బాగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ పెళ్లి అన్నపూర్ణా స్టూడియోస్ లోనే చేసుకుంటాం అని నాగార్జున ప్రకటించారు. బంధువులు, అతికొద్ది మంది మిత్రులతో చేసుకుంటాం అని తెలిపారు. మరి దీనికి కారణం ఏంటో తెలియదు గాని… ఒకరిని పిలిచి మరొకరిని పిలవకపోవడం బాగోదు అనో… రెండో పెళ్ళికి అంత క్రౌడ్ ఎందుకు అనో గాని కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని పిలిస్తే కేటిఆర్ ను పిలవాలి… హైడ్రా… ఎన్ కన్వెన్షన్ కూల్చింది కాబట్టి రేవంత్ ను పిలవలేం.

కేటిఆర్ ను పిలిచి రేవంత్ ను పిలవకపోతే బాగోదు. ఇక ఏపీలో చంద్రబాబును సిఎం కాబట్టి పిలవాలి… అలా పిలిస్తే జగన్ తో స్నేహం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా తేడా రావచ్చు. ఈ చికాకులు అన్నీ ఎందుకు అనే ఆలోచించుకునే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే బిగ్ బాస్ హౌస్ లో రిసెప్షన్ అయినా చేసుకుంటాం గాని… పెళ్ళికి గెస్ట్ లను మాత్రం పిలవం అంటూ పట్టుబట్టి కూర్చుంది అక్కినేని ఫ్యామిలీ. ఏ మాటకు ఆ మాట పెళ్లి మాత్రం యమా గ్రాండ్ గా… టూ మచ్ రిచ్ గా చేస్తున్నట్టు టాక్.